Asianet News TeluguAsianet News Telugu

విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ వచ్చేస్తోంది.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడేంటే?

కొన్నాళ్లుగా విడుదలకు నోచుకోని తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ రిలీజ్ కు సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Finally Dhruva Natchathiram Movie  Release Date Announced NSK
Author
First Published Sep 24, 2023, 12:54 PM IST

చియాన్ విక్రమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధృవ నక్షత్రం’ కొన్నేళ్లుగా వాయిదా పడుతూనే వస్తోంది. ఆరేళ్లుగా ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ మూవీ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కరోనా, బిజీ షెడ్యూళ్ల కారణాల వల్ల విడుదలకు మరీ ఆలస్యం అయ్యింది. ఫైనల్ గా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 

‘ధవ నక్షత్రం : ఛాప్టర్ వన్ యుద్ధ కాందం’ టైటిల్ తో రూపొందించిన ఈ చిత్రానికి గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ నే నిర్మించారు. 2017 జనవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది నెలలకే పూర్తైంది. కానీ విడుదల విషయంలో ఆలస్యం అయ్యింది. ఎట్టకేళలకు ఈ ఏడాది నవంబర్ 24న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

గౌతమ్ మీనన్ సినిమాల కోసం ఆడియెన్స్  ఎంత ఆసక్తిగా ఉంటారో తెలిసిందే. ఈ క్రమంలో ధృవ నక్షత్రం వస్తుందనడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు సాంగ్స్  కూడా విడుదలయ్యాయి. హరీశ్ జైరాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విక్రమ్ సరసన తెలుగు హీరోయిన్స్ రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్నారు. ఇందులో విక్రమ్ అండర్ కవర్ అపరేషన్ లో కనిపించనున్నారు. మరోవైపు విక్రమ్ నుంచి తదుపరి ‘తంగళాన్’ చిత్రం కూడా రాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios