వరుణ్ ధావన్, నీతూ కపూర్ జంటగా దర్శకుడు రాజ్ మెహతా డైరెక్షన్ లో జగ్ జగ్ జియో మూవీ తెరకెక్కతుంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఛండీఘర్ లో ప్రారంభం అయ్యింది.దీనితో చిత్ర యూనిట్ అక్కడకు వెళ్లడం జరిగింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. జగ్ జగ్ జియో మూవీ చిత్ర యూనిట్ లో నలుగురి కరోనా సోకిందని కథనాలు రావడం జరిగింది. 

హీరో వరుణ్ ధావన్, నీతూ కపూర్, దర్శకుడు రాజ్ మెహతాలతో పాటు అనిల్ కపూర్ కూడా కరోనా బారిన పడ్డారంటూ బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు రావడం జరిగింది. ఈ కథనాలపై అనిల్ కపూర్ స్పందించారు. తాను కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు, రిజల్ట్ నెగిటివ్ వచ్చిందంటూ ఆయన తెలియజేశారు. అలాగే తన ఆరోగ్యం, క్షేమం గురించి ఆందోనళ చెందిన అభిమానులకు ధన్యవాదాలు అని తెలిపారు. 

దీనితో అనిల్ కపూర్ కి కరోనా అన్న వార్తలలో నిజం లేదని తేలిపోయింది. ఐతే వరుణ్ ధావన్, నీతూ కపూర్ మరియు రాజ్ మెహతాలకు కరోనా సోకిన మాట వాస్తమే అని గట్టిగా వినిపిస్తుంది. కానీ ఈ విషయం పై ముగ్గురిలో ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన మాట వాస్తవమే నట.