టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా రెండు దశలలో గెలిచి మూడో దశలో పోటీపడ్డ అఖిల్, సోహైల్ లకు బిగ్  బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న ఉయ్యాలలో ఇద్దరూ కూర్చోవాలని, ఎవరు ఎక్కువ సమయం ఉయ్యాలలో ఉంటారో వారు గెలిచినట్లు అని చెప్పారు. ఉయ్యాలలో దాదాపు 24గంటలు అఖిల్, సోహైల్ కూర్చున్నారు. హౌస్ లో మంచి మిత్రులుగా ఉన్న అఖిల్, సోహైల్ ఈ టాస్క్ కోసం చివరి వరకు పోరాడారు. 

ఐతే 24గంటల కఠిన పరీక్ష తరువాత వీరిద్దరిలో కొత్త డౌట్స్ మొదలయ్యాయి. ఇద్దరు ఇలాగే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే, బిగ్ బాస్ నిర్ణయం ఏమవుతుందో అని డిస్కస్ చేసుకున్నారు. కెప్టెన్ అవుతానని అమ్మకు మాటిచ్చాను అది నెరవేర్చలేక పోయాను, కనీసం టాప్ ఫైవ్ లో అయినా ఉండాలంటే మెడల్ కావాలని అఖిల్ తోటి కంటెస్టెంట్ సోహైల్ తో చెప్పాడు. దీనికి సోహైల్ చాల వరకు కన్విన్స్ అయ్యాడు. 

కాసేపటి తరువాత గట్టిగా ఏడ్చేసిన సోహైల్ ఏదో ఒక నిర్ణయం చెప్పాలని బిగ్ బాస్ ని అడిగాడు. ఫైనల్ గా ఫినాలే మెడల్ ని అఖిల్ కి ఇచ్చేయాలని సోహైల్ డిసైడ్ అయ్యాడు. దానితో ఉయ్యాలలో నుండి దిగి వెళ్ళిపోయాడు. దీనితో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ ని అలా చూడలేను, హౌస్ లో బ్రదర్ కంటే ఎక్కువగా తనని చూసుకున్నాడని సోహైల్ చెప్పాడు. ఈ ఎపిసోడ్ లో సోహైల్ మరియు అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యారు.

టాస్క్ లో గెలిచిన కారణంగా,  ఏడుగురు సభ్యులతో ఫైనల్ ఎపిసోడ్ కి చేరుకున్న మొదటి కంటెస్టెంట్ గా అఖిల్ ని బిగ్ బాస్ ప్రకటించారు. ఐతే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న అఖిల్ సేవ్ అయితేనే, ఈ మెడల్ దక్కుతుందని చెప్పాడు.