బిగ్ బాస్ హౌస్ లో అఖిల్-మోనాల్-అభిజిత్ ల ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చాలా కాలంగా నడుస్తుంది. హౌస్ లో మనుగడ కోసం మోనాల్ వీరిద్దరి ఎమోషన్స్ తో ఆడుకుంటుందన్న అపవాదు కూడా ఉంది. పగలంతా అఖిల్ తో గడిపే మోనాల్...అఖిల్ నిద్రపోయాక అభిజిత్ తో స్నేహం చేస్తుంది. ఇంటిలో ఈ ఇద్దరితోనే మోనాల్ ఎక్కువగా గడుపుతారట. హౌస్ నుండి ఎలిమినేటై బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పారు. అఖిల్-అభిజిత్ ల మధ్య విభేదాలకు కూడా మోనాల్ కారణం అని కుమార్ సాయి చెప్పారు. 

కాగా నామినేషన్స్ కోసం జరిగిన ప్రక్రియలో మోనాల్-అభిజిత్-అఖిల్  విషయం తెరపైకి వచ్చింది. అమ్మ రాజశేఖర్ మోనాల్  అభిజిత్ తో మాట్లాడకపోవడానికి పరోక్షంగా అఖిల్ కారణం అన్నట్లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం అఖిల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నేను విసిగిపోయానని మోనాల్ కన్నీరు పెట్టుకోగా.. అభిజిత్ తో మాట్లాడి సార్టవుట్ చేస్తానని అఖిల్ అన్నాడు. దానికి మోనాల్ కూడా ఒకే చెప్పింది. 

అభిజిత్ తో మోనాల్ విషయం డిస్కస్ చేసిన అఖిల్ స్వయంగా ఆమె దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. స్టార్ మా విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమో ఈ ఆసక్తికర విషయాలతో కూడుకొని ఉంది. సాయంత్రం ప్రసారం కానున్న ఎపిసోడ్ పై తాజా ప్రోమో హైప్ పెంచేసింది. మరి అఖిల్-మోనాల్-అభిజిత్ ల మధ్య నెలకొన్న సమస్య తీరిందా లేదా అనేది తెలియాలంటే సాయంత్ర ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక ఈ వారానికి గానూ ఆరుగురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఆరియానా, మెహబూబ్‌,అఖిల్‌, మోనాల్   అమ్మ రాజశేఖర్‌, లాస్య నామినేట్ కావడం జరిగింది.