తాజాగా ప్రియాంక ప్రముఖ అమెరికా వ్యాఖ్యాత ఓప్రా విన్ ఫ్రేతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. మార్చి 20న డిస్కవరీ ప్లస్ లో ప్రసారం అయిన సూపర్ సౌల్ సిరీస్ షో కోసం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా తన గురించి, భర్త నిక్ జోనాస్, అతడితో ప్రేమ, పెళ్లి లాంటి ఆసక్తికర విషయాలను తెలిపింది ప్రియాంక. ముఖ్యంగా నిక్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని పంచుకుంది. అలాగే్ తన కెరీర్ లో ఎదుర్కొన్న సమస్యలు చెప్పుకొచ్చింది.

తన తాజా పుస్తకం “అన్ ఫినిషిడ్” ప్రమోషన్ లో భాగంగా ప్రియాంక చోప్రా మరో షాకింగ్ విషయాలు రివీల్ చేస్తోంది. ఇంతకు ముందు తనతో ఓ దర్శకుడు బిహేవిరియర్ గురించి చెప్పిన ఆమె ఇప్పుడు మరో తన జీవితంలో జరిగిన సంఘటనను బయట పెట్టింది. తన కెరియర్ ప్రారంభంలో ఒక దర్శకుడు అండర్ వేర్ మాత్రమే ఉంచుకొని మిగతా బట్టలన్నీ విప్పేసి డ్యాన్స్ చెయ్యమన్నాడని చెప్పుకొచ్చింది.
 
ప్రియాంక చెప్తూ...“అయితే, వెంటనే నేను ఆ సినిమా వదిలేశాను. కాకపోతే, అప్పుడు నేను ఇండస్ట్రీకి కొత్త. ఆ దర్శకుడు గురించి బయటకి చెప్పేంత ధైర్యం అప్పుడు లేదు. ఇలాంటివి అన్ని బయటకి మాట్లాడితే… ఆమెతో వర్క్ చెయ్యడం కష్టం అనే ముద్ర వేస్తారని నా కొలీగ్స్ చెప్పడంతో అప్పుడు మీడియాకి తెలపలేదు,” అని ప్రియాంక చోప్రా చెప్పింది. 

 ప్రియాంక చోప్రా త‌న జ్ఞాప‌కాల‌తో రూపొందించిన ‘అన్‌ఫినిష్డ్’  మార్కెట్‌లో విడుద‌లైన వారంలోపే   న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో చేరిపోగా.. విపరీతంగా సేల్ అవుతున్నాయి. నిక్ తో పెళ్లి విషయంలో తన తల్లి అయిన మధు చోప్రా ఎంతో కీలక పాత్ర పోషించిందని ఈ పుస్తకంలో ప్రియాంక తెలిపింది. 

 ఆమె మాట్లాడుతూ..." మొదట్లో నేను  నిక్ ని అంతగా సీరియస్ తీసుకోలేదు. అతడు ఛాటింగ్ చేయడం ప్రారంభించినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నాకేమో 35 ఏళ్లు. పెళ్లిచేసుకోవాలి, పిల్లలను కనాలనే ఆలోచనలో ఉన్నాను. అతడికి 25 ఏళ్లు కూడా ఉండవని మీకు తెలుసు. కొంతకాలం అలాగే దూరంగా ఉన్నాను. కానీ అతడితో కలిసి బయటకు వెళ్లిన తర్వాత నిక్ ను చూసి ఆశ్చర్యమేసింది. " అని  వివరించింది.