తెలుగు సినిమా మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. తెలుగు సినీ దర్శకురాలు బి. జయ గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హైదరాబాద్: తెలుగు సినిమా మరో ప్రముఖ వ్యక్తిని కోల్పోయింది. తెలుగు సినీ దర్శకురాలు బి. జయ గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు 54 ఏళ్లు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని పంజగుట్ట స్మశానవాటికలో జరుగుతాయి. ఆమె బిఎ రాజు సతీమణి.
పావని కల్యాణ్ అనే సినిమాతో దర్శకురాలిగా మారిన ఆమె చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.
జర్నలిస్టుగా ఆమె తన కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీ వారపత్రికను ప్రారంభించారు. ఆమె తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెం గ్రామంలో జన్మించారు .
అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంఎ సైకాలజీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్రజ్యోతితో జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత చిత్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. 2002లో దీపక్, అంకిత జంటగా నటించిన ప్రేమలో పావని చిత్రంతో చిత్ర దర్శకురాలిగా మారారు.
