పూరీ జ‌గ‌న్నాథ్ , విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేషన్ లో రూపొందుతున్న ఫైట‌ర్ ( వ‌ర్కింగ్ టైటిల్‌)  గత కొద్ది రోజులుగా ముంబైలో షూటింగ్ జ‌రుపుకున్న సంగతి తెలిసిందే. సినిమాలోని కీల‌క స‌న్నివేశాలని చిత్ర ప్ర‌ధాన పాత్ర ధారులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ బోస్ రాయ్‌, అలీల‌పై  షూట్ చేసారు ద‌ర్శ‌కుడు. 40 రోజుల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్ జ‌రిపిన చిత్ర యూనిట్ కరోనా ఎఫెక్ట్ తో  బ్రేక్ ఇచ్చింది.  ముంబైలోని 'ధారావి' స్లమ్ ఏరియా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. ఈ నేపధ్యంలో అక్కడ బాలెన్స్ మిగిలిన షూటింగ్ ని ముంబైలోనే చెయ్యాల్సి ఉంది. 

కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో చాలా కాలం దాకా ముంబైలో షూట్ చేసేందుకు అనుమతి దొరకదు. షూటింగ్ కూడా కష్టం.
ఇటీవల 'ధారావి' ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ఇక్కడే హైదరాబాద్ లోనే సెట్ వేసి  విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. 

అయితే కథా నేపథ్యంతో ముడిపడిన ప్రాంతంలోనే షూటింగు జరుపుకునే అవకాశం లేకుండా పోవడంతో, పూరి సేమ్ టు సేమ్ ముంబై ధారావి తరహా సెట్స్ వేసి,షూటింగ్ పూర్తి చేయేలనే నిర్ణయానికి  వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. సాధారణంగా పూరి తన సినిమాలకి సెట్స్ వేయించడు. అలాంటిది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి కావడంతో ఆయన సెట్స్ వైపు మొగ్గు చూపుతున్నటుగా చెబుతున్నారు. 

ఛార్మి, పూరీ జ‌గ‌న్నాథ్‌, క‌ర‌ణ్ జోహార్‌లు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.  భారీ తారాగ‌ణంతో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న  ఈ చిత్రం ఏడాది చివ‌ర‌లో కూడా రిలీజ్ అవ్వటం కష్టమని 2021లోనే రిలీజ్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి అంటున్నారు.