స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రమంగా వేగం పెంచుతున్నాడు. నా పేరు సూర్య తర్వాత బన్నీ నుంచి మరో చిత్రం రాలేదు. తనకు అచ్చొచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే బన్నీ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో కూడా బన్నీ చిత్రం ప్రారంభం కాబోతోంది. 

ఈ చిత్రానికి ఇప్పటికే 'ఐకాన్' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు వేణు శ్రీరామ్ నటీ నటుల్ని ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ చిత్రం చివరి దశకు చేరుకోగానే ఐకాన్ షూటింగ్ ప్రారంభించాలనేది ప్లాన్. 

ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే హీరోయిన్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. క్రేజీ బ్యూటీ రాశి ఖన్నాని దర్శకుడు హీరోయిన్ గా ఎంపిక చేశాడట. ఇటీవలే రాశి ఖన్నాకు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్, కథాంశం విభిన్నంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.