'దంగల్' సినిమాలో హీరో అమీర్ ఖాన్ కి కూతురిగా నటించింది ఫాతిమా సనాషేక్. ఈ సినిమా తరువాత అమీర్ ఖాన్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమాలో అవకాసం దక్కించుకుంది.

వరుసగా అమీర్  ఖాన్ సినిమాల్లో ఆఫర్లు రావడం, అతడితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అనిపించడంతో బాలీవుడ్ మీడియా వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని వార్తలను ప్రచురించింది. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో వీరి ఎఫైర్ హాట్ టాపిక్ గా నడిచింది.

ఎట్టకేలకు ఈ విషయంపై ఫాతిమా స్పందించింది. అమీర్ ఖాన్ తో ఎఫైర్ అనే వార్తలు తనను ఎంతగానో బాధించాయని వెల్లడించింది. అసలు ఇలాంటి విషయాలను ఎలా ఊహించుకోగలరు అంటూ ప్రశ్నించింది. ఈ వార్తలు విన్న తన తల్లి కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది.

అసలు ఈ ఎఫైర్ అంటూ నడుస్తోన్న వార్తలపై ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. మొదట్లో ఇలాంటి రూమర్లు విని బాధ పడేదాన్ని అని చెప్పిన ఫాతిమా ఆ తరువాత నుండి లైట్ తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చింది.