యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీలోని వైజాగ్ లో సేవాతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఫ్యాన్స్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే విభిన్న పాత్రల్లో నటిస్తూ పెద్ద సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇటీవల మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో అటు నార్త్ లోనూ ఆయనకు డైహార్ట్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. స్వాతంత్ర సమరయోధుడు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ జీవించిపోవడంతో దేశవ్యాప్తంగా ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు అభిమానులు.
అయితే మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ 39వ యేటా అడుగేయనున్నాడు. ఈ సందరర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ సేవా సమితి’ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బర్త్ సెలబ్రేషన్స్ లో భాగంగా మే 20న వైజాగ్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 6 గంట నుంచి 8 గంటల వరకు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆతర్వాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పాపా హోం లో ఫలహారం పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటల నుంచ 2:00 వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు భారీ బాణాసంచా మరియు కేట్ కటింగ్ చేయనున్నారు. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ ను వైజాగ్ లోని విమెన్స్ కాలేజీ ఎదురుగా నిర్వహించనున్నారు.
మరోవైపు ఇప్పటికే ట్విట్టర్ ఎన్టీఆర్ బర్త్ సెలబ్రేషన్స్ వైబ్స్ స్టార్ట్ అయ్యాయి. అభిమానులు ఎన్టీఆర్ సీడీపీ పోస్టర్లను ఈ రోజు సాయంత్రం 50కి పైగా ప్రాంతాల్లో లాంచ్ చేయనున్నారు. మరోవైపు ఆయన చిత్రాల్లోన్ని పవర్ ఫుల్ సన్నివేశాలను ఎడిట్ చేస్తూ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి వైలెన్స్ క్రియేట్ కాకుండా ఇతర హీరోల అభిమానులతోనూ కలుపుకుపోతుడటం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’తో చివరిగా అలరించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30 చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ 31’ రానుంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి ఈ రెండు చిత్రాల నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తోంది.
