స్టార్స్ కు ఫ్యాన్సే బలం. వాళ్లను నమ్మే భారీ బడ్జెట్ సినిమాలు తీస్తారు. వాళ్ళను నమ్ముకునే రాజకీయాల్లోకి వస్తారు. అయితే ఆ అభిమానం ఎంతవరకూ ఓట్లగా మారుతుందనే అనుమానం రజనీకు ఉన్నట్లుంది. అందుకే ఆయన రాజకీయాల్లోకి వస్తా అంటూ ఊరిస్తూ దూరంగా ఉండిపోతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీకు సపోర్ట్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.  ఆ విషయమై ఫ్యాన్స్ ఆయన్ని  రిక్వెస్ట్ చేస్తున్నారు.

‘మీరు సినిమాల్లో వరుసగా నటించుకుంటూ పోతే అభ్యంతరం లేదు. అయితే బీజేపీకి మద్దతు అనే రూమర్స్ ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి. అలాంటి రూమర్స్ కు పుల్‌స్టాప్‌ పెట్టండి’అని నటుడు రజనీకాంత్‌కు ఆయన ఫ్యాన్స్ రిక్వస్ట్  చేస్తున్నారు.  

అందుకు కారణం  బీజేపీపై తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్‌ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం వారిని ఇబ్బందుల్లో నెట్టేస్తోంది.  దాంతో వారిప్పుడు ఈ రూమర్స్ కు తలైవా పుల్‌స్టాప్‌ పెట్టకపోతే సినిమాలపరంగానూ ఇబ్బందులు ఎదురు అవుతాయని అంటన్నారు. రనజీ ప్యాన్స్ లో కొందరు ఆయన బీజేపి కు సపోర్ట్ చేస్తున్నారని ప్రక్కకు వెళ్లిపోతున్నారని సీనియర్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.  దాంతో రజనీకాంత్  ఒక సమావేశం ఏర్పాటు చేసి అభప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం దర్భార్‌ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్ తదుపరి శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. అలాగే , మళ్లీ ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.