బాహుబలి చిత్రంతో రాజమౌళి అంటే ఏంటో మొత్తం ప్రపంచానికి అర్దమైంది. స్టార్ హీరోలంతా ఆయన తో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నారు. అదే సమయంలో వారి అభిమానులు సైతం రాజమౌళితో తమ హీరో సినిమా చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ అభిమానులు ..తమ హీరో సినిమా ఎప్పుడు రాజమౌళితో ఉంటుందో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ మేనియా నడుస్తోంది. 2.0 రిలీజ్ తో ఎక్కడ చూసినా అవే మాటలు, చర్చలు. 

ఈ నేపధ్యంలో రాజమౌళి..2.0 కోసం వెయిట్ చేస్తున్నట్లు ట్వీట్ చేసారు. దాంతో అభిమానులంతా ఆ ట్వీట్ కు రిప్లైగా ..రజనీతో ఓ సినిమా చేయమని కోరుతున్నారు. రజనీ రిటైర్ కాకముందే సినిమా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. రజనీ అభిమానులు తాము ఈ కాంబో కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ రాజమౌళి చూడకుండా ఉండరు. అయితే ఆయనేమి స్పందించలేదు. 

వాస్తవానికి రాజమౌళి, రజనీకాంత్ సినిమా చెయ్యాలంటే చాలా కసరత్తు చేయాలి. రజనీ స్దాయికి తగ్గ కథని రాజమౌళి రెడీ చేయటం ఒకెత్తు అయితే...రాజమౌళి కు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు రజనీ రెడీ గా ఉండాలి. అంతేకాదు ప్రస్తుతం ఎన్టీఆర్, తారక్ లతో చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్తి కావాలి. ఆ తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించగలరు. అంటే ఎంతలేదన్నా 2020 వచ్చేస్తుంది. 

అప్పటి పరిస్దితులు ఎలా ఉంటాయో..రజనీ అప్పటికి సినిమాలు చేస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవచ్చు.  ఎందుకంటే రజనీ...ఓ సరైన హిట్ పడగానే రిటైర్ అవుదామనే ఆలోచనలో ఉన్నట్లు తమిళ మీడియా చెప్తోంది.