తమిళమ్మాయి సాయి పల్లవి మలయాళం, తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన 'NGK' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితరం హీరోయిన్లు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంటే.. సాయి పల్లవి మాత్రం సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది.

అలాంటిది ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో చాట్ చేస్తానని ట్వీట్ చేసేసరికి వేలల్లో ప్రశ్నలు వచ్చాయి. అయితే సాయి పల్లవి మాత్రం హ్యాండ్ ఇచ్చేసింది. 'చాలా రోజులైంది మీ అందరితో మాట్లాడి.. ఇప్పుడైతే మాట్లాడుకుందాం, ఏమైనా అడగొచ్చు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

దీంతో చాలా మంది అభిమానులు స్పందించారు. దాదాపు వెయ్యికి పైగా ట్వీట్లు వచ్చాయి. కానీ సాయి పల్లవి ఆరేడు ప్రశ్నలకు సమాధానమిచ్చి సైడ్ అయిపొయింది. దీంతో నెటిజన్లకు కోపం వచ్చింది. మాట్లాడుకుందామని చెప్పి మోసం చేస్తావా అంటూ ఆమెని తిట్టడం మొదలుపెట్టారు.

దీంతో ఈ బ్యూటీ క్షమాపణలు చెప్పక తప్పలేదు. చాలా మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను.. నన్ను క్షమించండి అంటూ ట్వీట్ చేసింది. ఎన్జీకే సినిమాను అందరూ ఎంజాయ్ చేయండి అంటూ చాట్ క్లోజ్ చేసింది.