దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంకా పవన్‌ కోలుకున్నారనే అప్‌డేట్‌ని ఇవ్వలేదు. మధ్యలో ఆయన కోలుకుంటున్నారని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి ప్రెస్‌నోట్‌ రాలేదు. 

పవన్‌ కళ్యాణ్‌కి ఏమైంది. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదా? ఆయన హెల్త్ అప్‌డేట్‌ ఇవ్వకపోవడానికి కారణమేంటి? ప్రస్తుతం పవన్‌ అభిమానుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. పవన్‌కి కరోనా సోకింది గత నెల ఏప్రిల్‌ 16న. ఆయనకు తన ఫామ్‌ హౌజ్‌లోనే ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. ఆరోగ్యం బాగానే ఉందని, ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉందని, దానికి స్పెషల్‌గా డాక్టర్లు కేర్‌ తీసుకుని ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నట్టు తెలిపారు. పవన్‌ వ్యక్తిగత డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. 

కానీ దాదాపు 20 రోజులు కావస్తున్నా ఇంకా పవన్‌ కోలుకున్నారనే అప్‌డేట్‌ని ఇవ్వలేదు. మధ్యలో ఆయన కోలుకుంటున్నారని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి ప్రెస్‌నోట్‌ రాలేదు. ఆయనకు ఇంకా ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారా? ఊపిరితిత్తుల నిమ్ము ఇంకా తగ్గలేదా? లేక కోలుకున్నారా? అనేది ఇప్పటి వరకు ఆయన టీమ్‌ నుంచి తెలపలేదు. దీంతో పవన్‌కి ఏమైందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు వేచి చూసిన ఫ్యాన్స్‌ ఇక లాభం లేదని, డైరెక్ట్ గా అడగాలని నిర్ణయించుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా `పవన్‌ హెల్త్ బులెటిన్‌ ప్లీజ్‌` అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి దీంతోనైనా స్పందిస్తారేమో చూడాలి. 

పవన్‌ ఇటీవల `వకీల్‌సాబ్‌`తో బంపర్‌ హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో రానాతో కలిసి నటిస్తున్నారు. సాగర్‌ కె చంద్ర దీనికి దర్శకుడు. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఏకకాలంలో చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. పవన్‌కి కరోనా , కరోనా విజృంభనతో ప్రస్తుతం వీటి షూటింగ్‌లను వాయిదా వేశారు.