Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ కు అభిమాని సర్ ప్రైజ్.. ఆ కుర్రాడి టాలెంట్ చూశారా.. వైరల్ వీడియో.!

అల్లు అర్జున్ కు అభిమాని ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చారు. తనలోని ప్రతిభను ప్రదర్శిస్తూ బన్నీని ఫిదా చేసేలా గిఫ్ట్ అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

Fan gave Surprise To Allu Arjun With his Unique Talent NSK
Author
First Published Dec 9, 2023, 8:01 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ పోతున్నారు. బన్నీకి సపరేట్ అల్లు ఆర్మీనే ఏర్పాటు చేసుకున్నారు. దీంతో తన రాబోయే చిత్రాల కోసం బాగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో అభిమానులు కూడా బన్నీని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. గతంలో Pushpa The Rise రిలీజ్ సందర్భంగా వినూత్నంగా ‘పుష్ప రాజ్’ ఫొటోను ఆర్ట్ వేసి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మరో అభిమాని ఊహించని విధంగా సర్ ప్రైజ్ ఇచ్చారు. 

చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఏదోలా ప్రయత్నిస్తుంటారు. పచ్చబొట్టు, పేపర్ పై పెన్సిల్ ఆర్ట్ లు, పలు రకాలుగా తమ అభిమాన హీరోపై ప్రేమను చూపిస్తుంటారు. ఇక తాజాగా ఓ ఆర్టిస్ట్ మాత్రం తన అభిమానాన్ని వినూత్నంగా చూపించారు. ఏకంగా నీటిపైనే పుష్పరాజ్ తగ్గెదేలే ఫొటోనూ ఆర్ట్ వేసి అబ్బుర పరిచారు. అల్లు అర్జున్ ను తన టాలెంట్ తో సర్ ప్రైజ్ చేశారు. 

ప్రస్తుతంఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పై తను చూపించిన అభిమానానికి మిగితా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వీడియోను నెట్టింట మరింతగా వైరల్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం Pushpa 2 The Rule లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న (Rashmika Mandanna)   కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్,  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించబోతున్నారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios