విజయ్ దేవరకొండ సడెన్ సర్‌ప్రైజ్..`ఫ్యామిలీ స్టార్` మ్యూజికల్ జర్నీ స్టార్ట్..
విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో `గీత గోవిందం` తర్వాత మరో మూవీ `ఫ్యామిలీ స్టార్` వస్తుంది. తాజాగా ఈ మూవీ మ్యూజిక్ జర్నీ ప్రారంభించింది చిత్ర బృందం.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ `ఖుషి` వంటి మ్యూజిక్ హిట్ తర్వాత ఇప్పుడు `ఫ్యామిలీ స్టార్`(The Family Star) చిత్రంలో నటిస్తున్నారు. తనకు `గీతా గోవిందం` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది. ఈ సమ్మర్ స్పెషల్‌గా అలరించబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. `ఐరనే వంచాలా ఏంటి` అంటూ విలన్లకి విజయ్ చూపించిన ఇన్నోసెంట్ యాటిట్యూడ్ ఆకట్టుకుంటుంది. చివరికి వైఫ్ దగ్గర స్ట్రక్ అయిపోయినట్టుగా సాగే గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇక ఈ మూవీ నుంచి తాజాగా సడెన్ సర్‌ప్రైజ్ వచ్చింది. మ్యూజికల్ జర్నీని ప్రారంభించబోతున్నారు. పాటలు విడుదల చేయబోతున్నారు. తాజాగా మొదటి పాటకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. ఈ మూవీ నుంచి `నంద నందాన` అంటూ సాగే మొదటి పాట ప్రోమోని విడుదల చేశారు. వినసొంపుగా సాగే మెలోడీగా ఈ సాంగ్ ఉంటుందని అర్థమవుతుంది. క్యూరియాసిటీని పెంచుతుంది. ఫిబ్రవరి 7న ఈ పూర్తి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.
గోపీసుందర్ సంగీతం అందిస్తున్న చిత్రమిది. ఈ మొదటి పాటని సిద్ శ్రీరామ్ ఆలపించడం విశేషం. ఆనంత శ్రీరామ్ ఈ పాటని రాశారు. ఈ థ్రయో మరోసారి కలిసి పనిచేయడం విశేషం. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. `గీత గోవిందం`లో `ఇంకేం ఇంకేం కావాలే` అనే పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాట కూడా హిట్ కావడం ఖాయమే అంటున్నారు. ఇందులో మృణాల్‌ని ఉద్దేశించి హీరో విజయ్ దేవరకొండ ఈ పాటని ఆలపిస్తాడని తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. ఈ సమ్మర్‌కి ఫ్యామిలీ ఆడియెన్స్ కి, యూత్‌కి మంచి మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది `ది ఫ్యామిలీ స్టార్` యూనిట్.
Read more: మురళీమోహన్‌ని పట్టుకుని అందాలన్నీ అందుకోరా అంటూ `జబర్దస్త్` రష్మి రచ్చ.. బాబోయ్ ఏంటీ అరాచకం..
Also Read: ఆ స్టెప్పులు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు.. చిరంజీవి డాన్సులపై సాయిపల్లవి కామెంట్స్ వైరల్..