Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 6: ముందు ఒకలా, వెనకాల మరోలా.. రేవంత్‌ నిజ స్వరూపం బయటపెట్టిన ఫైమా.. పోటుగాడిలా అంటూ..

బిగ్‌ బాస్‌ తెలుగు 6 13వ వారం నామినేషన్లలో రేవంత్‌ నిజ స్వరూపం బయటపెట్టింది ఫైమా. నువ్వు పోటుగాడిలా మాట్లాడకు అంటూ రెచ్చిపోయాడు ఆదిరెడ్డి. దీంతో నామినేషన్ల ప్రక్రియ ఒక్కసారిగా హీటెక్కిపోయింది. 

faima revealed revanth real nature in bigg boss telugu 6 and adi reddy shocking comments
Author
First Published Nov 28, 2022, 11:40 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌ 12 వారాలు పూర్తి చేసుకుని 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఇంకో మూడు వారాల్లో షో పూర్తి కాబోతుంది. ఆదివారం రాజ్‌ ఎలిమినేట్‌ అయిన విషయంతెలిసిందే. ఇప్పుడు వచ్చే వారానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగా వేడి వేడిగా సాగింది. నామినేట్‌ చేసే సమయంలో ఒకరిపై ఒకరు ఫైర్‌ అవుతూ ఒక్కసారిగా హీటు పెంచారు. మీద మీదకు వెళ్లేంత వరకు వెళ్లడంతో మిగిలిన కంటెస్టెంట్లు షాక్‌ అయ్యారు. ఈ సంఘటన రేవంత్‌, ఫైమా విషయంలో జరగడం విశేషం. 

సోమవారం ఎపిసోడ్‌ మొదట ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, వివరణ ఇచ్చుకోవడంతో స్టార్ట్ అయ్యింది. ఇందులో రేవంత్‌, శ్రీహాన్‌ మధ్య ఘాటుగానే చర్చ జరిగింది. తనని పర్సనల్‌గా కామెంట్‌ చేస్తున్నాడని శ్రీహాన్‌ చెప్పాడు. చూసే దృష్టిని బట్టి ఉంటుందని రేవంత్‌ అన్నారు. ఈ క్రమంలో వీరి మధ్య గొడవ ప్రారంభమైంది. అయితే ఎవరు ఏది కావాలని పోట్రే చేయరని తెలిపారు శ్రీహాన్‌. దీంతో రేవంత్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

 ఆయన వెళ్లిపోయాక శ్రీసత్యతో తన నడక, తన ముక్కు,తన మాటల గురించి కామెంట్లు చేస్తున్నారని రేవంత్‌పై ఆరోపణలు చేశాడు శ్రీహాన్‌. సిరి కూడా అదే విషయం నాతో చెప్పిందన్నారు. అదే సమయంలో శ్రీ సత్య తరఫున కూడా తానే వాదిస్తున్నానని, ఫైట్‌ చేస్తున్నాని తెలిపాడు శ్రీహాన్‌. ఇక రాజ్‌ ఎలిమినేట్‌ కావడంతో ఫైమా కన్నీళ్లు పెట్టుకుంది. తన పాస్‌ని ఉపయోగించలేకపోయానని బాధ పడింది. ఆ తర్వాత ఫైమా, రేవంత్‌, ఆదిరెడ్డి మధ్య చాడీలకు సంబంధించిన డిస్కషన్‌ వచ్చింది. 

కట్‌ చేస్తే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యాక హౌజ్‌మేట్స్ రెచ్చిపోయారు. మొదట ఆదిరెడ్డి.. రేవంత్‌ని నామినేట్‌ చేశాడు. నిన్న చేసేన మానిప్యూలేటర్‌ అనే కామెంట్లని ప్రస్తావిస్తూ నామినేట్‌ చేస్తున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన చర్చ ఇద్దరి మధ్య హాట్‌గా సాగింది. రెచ్పిపోకు రేవంత్‌, నువ్వు పెద్ద పోటుగాడిలా మాట్లాడకు అంటూ ఆదిరెడ్డి కామెంట్లు చేయడం, దాన్ని రేవంత్‌ అదే తరహాలో ప్రొటెస్ట్ చేయడంతో హౌజ్‌ హీటెక్కింది. రోహిత్‌ని నామినేట్‌ చేస్తూ ఫైట్‌ చేయడం లేదని, స్టాండ్‌ తీసుకోవడం లేదన్నారు. 

ఫైమా.. రేవంత్‌, రోహిత్‌లను నామినేట్‌ చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకురాలిగా సరిగా చేయలేదని, కొందరికి సపోర్ట్ చేయడాన్ని ఆయన వ్యతిరేకించాడు. దీనికి ఫైమా సైతం గట్టిగానే రియాక్ట్ అయ్యింది. రోహిత్‌ని తనకంటే స్ట్రాంగ్‌ అని నామినేట్‌ చేసింది ఫైమా. శ్రీహాన్‌.. స్టాండ్‌ తీసుకోవడం లేదని రోహిత్ ని నామినేట్‌ చేయగా, టాస్క్ లో ఇక అమ్మాయిలతో ఆడి గెలవండి అంటూ కామెంట్‌ చేయడాన్ని అభ్యంతరం చెబుతూ నామినేట్‌ చేశాడు. దానికి ఆదిరెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు.

కీర్తి.. రేవంత్‌, శ్రీ సత్యలను నామినేట్‌ చేసింది. వెనకాల మాట్లాడుతున్నాడనే విషయం గురించి నామినేట్‌ చేసింది. ముందు ఒకలా, వెనకాలు మరోలా మాట్లాడుతున్నారని, నవ్వుకుంటున్నారని తెలిపారు. శ్రీ సత్యలో వెటకాలం తగ్గించుకోవాలన్నారు. శ్రీ సత్య.. కీర్తిని, ఆదిరెడ్డిలను నామినేట్‌ చేసింది. ఈసందర్భంగా ఓ హాట్‌ కామెంట్‌ చేసింది శ్రీ సత్య. గేమ్‌ ఆడేవాళ్లు వెళ్తున్నారని ఆరోపించింది. అందుకే కాస్త టెన్షన్‌గా ఉంటుందన్నారు. రోహిత్‌.. ఆదిరెడ్డి, ఫైమాలను నామినేట్‌ చేశాడు. 

రేవంత్‌.. ఆదిరెడ్డి, ఫైమాలను నామినేట్‌ చేశాడు. చేయనని దానికి చేశాడని చెబుతున్నావంటూ ఆదిరెడ్డిని నామినేట్‌ చేశాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ వాతావరణం చోటు చేసుకుంది. ఇక రేవంత్‌ని నామినేట్‌ చేస్తూ ముందు ఒకలా, వెనకాల ఒకలా మాట్లాడతావని తెలిపింది. రేవంత్‌ నిజ స్వరూపం బయటపెట్టింది. ఇన్నాళ్లు ఇదే జరుగుతుందని, కానీ దీన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ షాకిచ్చింది ఫైమా. ఇద్దరు కొట్టుకునేలా దగ్గరికి వెళ్లడంతో మొత్తం హీటెక్కిపోయింది. ఇనయ.. రేవంత్‌, శ్రీ సత్యలను నామినేట్‌ చేసింది. 

ఇక ఫైనల్‌గా 13వ వారంలో కెప్టెన్‌  ఇనయ, శ్రీహాన్‌ నామినేషన్లకి దూరం కాగా, రేవంత్‌, ఆదిరెడ్డి, కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్‌లు నామినేట్‌ అయ్యారు. ఇదిలా ఉంటే గత వారం ఫుడ్‌ వేస్ట్ చేసిన నేపథ్యంలో బిగ్‌ బాస్‌ క్లాస్‌ పీకారు. రేషన్‌ మేనేజర్‌ని పిలిపించి క్లీన్‌చేయించారు. ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ని కట్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios