టీవీ 9 న్యూస్ రీడర్, బిగ్‌‌బాస్ 4 కంటెస్టెంట్ దేవీ నాగవల్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దర్శక దిగ్గజం దాసరి నారాయణరావుకు దేవీ  మనవరాలు అవుతుందట. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఆమె తల్లి. 

రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి స్టైలిష్‌గా వార్తలు చదవడంతో పాటు ఆమె హెయిర్‌స్టైల్, డ్రెస్సింగ్ అంతా విచిత్రంగా ఉంటుంది. బిగ్‌బాస్‌ 4 హౌస్‌లోనూ దేవి అంతే సీరియస్‌గా ఉంటూ ప్రేక్షకులను దూసుకుపోతోంది.

దేవి నాగవల్లికి మద్ధతుగా టీవీ9లోని ఆమో సహోద్యోగులు, యాంకర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం గతంలో సెలబ్రిటీలతో చేసిన ఇంటర్వ్యూలను ఓటింగ్ కోసం వాడుతున్నారు. 

ఈ నేపథ్యంలో తన కుమార్తె బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లడంపై దేవి నాగవల్లి తల్లి హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన బిడ్డ ఇంట్లో ఎలా ఉంటుందో.. బిగ్‌బాస్ హౌస్‌‌ అలాగే వుందన్నారు.

తన కుమార్తె బిగ్‌బాస్‌ హౌస్‌లో కూడా అలాగే ఫైట్ చేస్తోందని... ఆమె తప్పకుండా గెలుస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తన అత్తయ్య తమ్ముడని, మా ఆయనకు మేనమామ అని దేవి నాగవల్లికి తాత అవుతారని ఆమె చెప్పారు.

ఇరు కుటుంబాలు పలు కార్యక్రమాలకు హాజరవుతూనే ఉంటాయని తెలిపారు. అయితే తాము ఎప్పుడూ దాసరి పలుకుబడిని ఉపయోగించుకోలేదన్నారు. మేం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. నరసాపురం, పాలకొల్లులో ఆయనకి మాకూ చాలామంది చుట్టాలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. 

దేవి చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని.. రూల్స్ తాను ఫాలో కావడమే కాకుండా మాకు చెప్తుంది. వాటిని మేం ఫాలో అవుతాం. ఆమె చెప్పింది ఎప్పుడూ రైటే. ఏది ఎలా చేయాలో.. ఎక్కడ చేయాలో ఆమెకు బాగా తెలుసు. ఆమె సీరియస్‌గా ఉండదు.. అందరినీ కలుపుకుంటుందని తెలిపారు.

చిన్నప్పటి నుంచి నా కూతురు దేవి అన్నింటిలోనూ టాపే. రాజమండ్రి ఉమెన్స్ కాలేజ్‌లో చదివిన రోజుల్లో క్రికెట్ ఆడేది. చాలా అవార్డులు వచ్చేవి. ఆమె ఆట మాట అన్నీ ఫైట్ చేసేటట్టే ఉంటుంది.

ఆమె ఫైట్ చేసే విధానం కరెక్ట్‌గా ఉంటుంది. లేడీ బిగ్ బాస్ అవుతా అని చెప్పింది.. తప్పకుండా అవుతుంది కూడా.. లేడీ బిగ్ బాస్ అనే పేరు దేవి నాగవల్లికి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని దేవి తల్లి అభిప్రాయపడ్డారు.

చిన్నప్పటి నుంచి దేవి చాలా కష్టాలు పడింది. 2000 సంవత్సరంలో ఆమె నాన్నగారు చనిపోయారని నాటి నుంచి ఇంటి బాధ్యత మొత్తం ఆమెదే. నాకు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి. చాలా అప్పులు చేశాను.. ఇళ్లు కూడా అమ్మేసుకున్నాం.

కాని దేవి నన్ను వాళ్ల అన్నయ్య, తమ్ముడ్ని అందర్నీ సేవ్ చేసింది. ఇద్దరు కొడుకులు, కూతురు, కోడలు, మనవలు అందరం కలిసే ఉంటామన్నారు. దేవికి సాయం చేసే గుణం ఎక్కువని, తమ ఇంట్లో పనిచేసే అమ్మాయి కూతురి పెళ్లికి రూ.50 వేలు సాయం చేసిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

అంతేకాకుండా అరకులో అనాథ పిల్లలకు సంవత్సరానికి రూ. లక్ష ఇస్తుందన్నారు. దీనితో పాటు టీవీ9లో పనిచేసే అబ్బాయికి ప్రమాదం జరిగితే సాయం చేసిందని వెల్లడించింది. దేవి నాగవల్లి నామినేషన్స్‌లో ఉన్నా ఆమె ఎలిమినేట్ కాదని, జనాలు కూడా ఆశీర్వదిస్తారని తెలిపింది. ప్రజలే ఆమెను గెలిపిస్తారని దేవీ నాగవల్లి తల్లి చెబుతున్నారు.