Asianet News TeluguAsianet News Telugu

ఆత్మహత్యకు ప్రయత్నించిన జబర్దస్త్ గెటప్ శ్రీను...కారణం తెలిస్తే షాక్

  • తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ గెటప్ శీను
  • వైవిధ్య భరితమైన గెటప్స్ తో ఎప్పటికి కప్పుడు సరి కొత్త హాస్యాన్ని పండించడంలో గెటప్ శీను దిట్ట
  • ఆత్మహత్యకు ప్రయత్నించిన జబర్దస్త్ గెటప్ శ్రీను...కారణం తెలిస్తే షాక్

 

Facts About Getup Srinu

నిరు పేద కుటుంబం నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ రంగం లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ గెటప్ శీను.వైవిధ్య భరితమైన గెటప్స్ తో ఎప్పటికి కప్పుడు సరి కొత్త హాస్యాన్ని పండించడంలో గెటప్ శీను దిట్ట. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బాగా పాపులర్ కమెడియన్స్ లో గెటప్ శీను కూడా  ఒకరు. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడిన  శీను,కరెంటు కూడా లేని ఇంట్లో పెరిగాడు.చదువు మధ్యలోనే మానేసి,అప్పులు తీర్చడానికి పని కోసం  హైదరాబాద్ వచ్చాడు.ఓ చిన్న జాబ్ చేసుకుంటునప్పుడు అసిస్టెంట్  డైరెక్టర్  మ్యాగీతో  కలసి ఒక రూమ్ లో అద్దెకి ఉండేవాడట.మ్యాగీ ప్రోత్సాహంతోనే  సినిమా నటుడు అవ్వాలని ఆకాంక్ష గెటప్ శీను లో కలిగింది.దాంతో తేజ  డైరెక్షన్ లో కేక అనే సినిమా ఆడిషన్ కి వెళ్ళాడట. ఫస్ట్ రౌండ్ లో కొన్ని వందలమందిని టెస్ట్ చేసి వాళ్లలో కొంత మందిని సెలెక్ట్ చేసారు.ఆలా సెలెక్ట్ అయ్యిన వారిలో గెటప్ శీను కూడా ఉన్నాడట.అయితే సెకండ్ రౌండ్ టెస్ట్ లో తనని చూసిన దర్శకుడు  తేజ ఎదో ఆలోచిస్తున్నట్టు ఉన్నావ్  అని అడిగాడట.అందుకు తాను ఏం ఆలోచించడం లేదు సర్ అని జవాబు చెప్పాడట.దాంతో తేజకు మండిపోయిందంట.నువ్వు ఇప్పుడే ఇంత ఇదిగా సమాధానం చెపుతున్నావ్ రేపు సినిమాలో  చాల కష్టం వెళ్లి ఇంకా ఎక్కడైనా చూసుకో పో అంటూ శీనుని రిజక్ట్ చేశాడట.ఆ అవమానం తట్టుకోలేక గెటప్ శీను హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోదాం అనుకున్నాడట. అయితే బుద్దుడి విగ్రహం దగ్గర చాల సేపు  ఆలోచించానని 
చనిపోతే ఏం వస్తుందని ఆలోచన రావటంతో  ఆత్మహత్య విరమించుకున్నానని తెలిపాడు.తాను చచ్చిపోతే తన అమ్మానాన్న ఏం అయిపోతారో, అన్న ఆలోచన వచ్చిందని,చచ్చేంత కష్టపడాలి కానీ సినిమాకోసం చచ్చిపోకూడదని ఆనాడే నిర్ణయించుకున్నాని  వెల్లడించారు గెటప్ శీను

Follow Us:
Download App:
  • android
  • ios