Asianet News TeluguAsianet News Telugu

F3 : ‘ఎఫ్3’మూవీ షూటింగ్ పూర్తి ... ఏప్రిల్ లో ‘నవ్వుల పండగే’ అంటున్న ఎఫ్ 3 టీం..

2019లో ఎఫ్ 2 మూవీతో ప్రేక్షకులను నవ్వించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఎఫ్ 3  ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మూవీతో మరోసారి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించనున్నాడు. ఇందుకు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ పేర్కొంది.
 

F3 Movie Shooting Completed, Social Media Post
Author
Hyderabad, First Published Jan 29, 2022, 5:25 PM IST

విక్టరీ వెంకటేష్, మెగా  ప్రిన్స్ వరుణ్ తేజ్ కథనాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి తెరకెక్కించిన మూవీ ‘ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ చిత్రంతో అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. మరోవైపు వెంకటేష్ - తమన్న, వరుణ్ తేజ్ - మెహరీన్ జంటగా నటించిన ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లాలు పెట్టే టార్జర్ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ మూవీలో చెప్పిన ‘వెంకీ ఆసనం’ చాలా పాపులర్ అయ్యింది. అలాగే ‘పెళ్లాన్ని డీల్ చేసుడూ నాకు మస్తు తెలుసు బ్రో’ లాంటి డైలాగ్స్ కూడా థియేర్లలో నవ్వులు పూయించాయి. 

పుల్ కామెడీతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ను డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన  షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.  టాలీవుడ్ లో మోస్ట్ అవైటేడ్ మూవీల్లో ఒకటి ఈ ‘ఎఫ్3’. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను గతంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మూవీ చిత్రీకరణకు సంబంధించిన వీడియోలను మాత్రమే షేర్ చేస్తూ ప్రేక్షకులను వెయిట్ చేయించారు. 

 

 
ఎట్టకేళలకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘మా షూటింగ్ జర్నీ పూర్తి అయ్యింది. మీ నవ్వుల జర్నీ మొదలవుద్ది, వస్తే.. కొద్దిగా ముందుకు... వెళ్లినా కొద్దిగా వెక్కి.. థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా!’ అంటూ డైరెక్టర్ అనిల్ పేర్కొన్నాడు.  ఇటివల  ‘ఎఫ్ 2’ మూవీ రిలీజై మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  టీం మొత్తం సెలబ్రెషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడే  ఎఫ్3 గురించి మాట్లాడుతూ మూవీ మాములుగా ఉండదంటూ అనిల్ రావిపూడి ఆడియెన్స్ కు ప్రామీస్ చేశారు. ప్రస్తుతం ఏదేమైనా ఏప్రిల్ 28కి మూవీని రిలీజ్ చేసి, ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తామంటున్నాడు. ఆడియెన్స్ కూడా ఈ మూవీ నుంచి ఫన్ ను చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios