వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన `ఎఫ్3` మూవీ నాలుగు రోజుల కలెక్షన్లని ప్రకటించింది యూనిట్. భారీగా వసూళ్లని రాబట్టినట్టు చిత్ర బృందం చెబుతోంది.
వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్(Varun Tej) కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్3`(F3) గత శుక్రవారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తమన్నా(Tamannaah), మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, శిరీష్‌తో కలిసి దిల్‌రాజు నిర్మించారు. మూడేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్2`కిది సీక్వెల్. వీకెండ్ పూర్తి చేసుకుని హార్డ్ డేస్‌లోకి అడుగుపెట్టిందీ చిత్రం. అయితే తాజాగా నాలుగు రోజుల కలెక్షన్లని ప్రకటించింది `ఎఫ్3` యూనిట్.
F3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 73కోట్ల గ్రాస్(F3 Movie Collections)ని వసూలు చేసినట్టు తెలిపింది. నాల్గో రోజు కలెక్షన్లు భారీగా డ్రాప్ అయినా, హార్డ్ డేస్‌లో ఈ స్థాయి కలెక్షన్లు రావడం గొప్ప విషయంగానే పరిగణిస్తుంది యూనిట్. నాల్గో రోజు ఈ సినిమా 4.64కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో 32.11కోట్ల షేర్‌ని రాబట్టింది. ఇక నాల్గో రోజు కలెక్షన్లు ఏరియా వైజ్‌గా చూస్తే, నైజాంలో 2.03కోట్లు, గుంటూరు 28లక్షలు, సీడెడ్ 71లక్షలు, నెల్లూరు 14 లక్షలు, ఈస్ట్ గోదావరి 34లక్షలు, వెస్ట్ 20లక్షలు, కృష్ణ 28, యూఏలో 66లక్షలు వసూలు చేసినట్టు టాక్. మొత్తానికి నిర్మాత దిల్‌రాజు పంటపండినట్టే అని అంటున్నారు. ఆల్మోస్ట్ ఇది బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉందని చిత్ర బృందం నుంచి వస్తోన్న కామెంట్.
వెంకటేష్, వరుణ్ తేజ కామెడీ, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ అందాలు, పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్, అనిల్ రావిపూడి దర్శకత్వం ఈ సినిమాకి కలసి వచ్చాయని యూనిట్ చెబుతుంది. ఈ సినిమాపై అలీ కూడా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సినిమాకి నెగటివ్ టాక్‌ని ప్రచారం చేస్తున్నారని స్టేజ్‌పైనే స్టేట్‌మెంట్ ఇచ్చి దుమారం రేపారు. ఫెయిల్ అయితే కొందరు చంకలు గుద్దుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఇన్‌సైడ్ టాక్ మరోలా ఉంది. చిత్ర బృందం ప్రకటించిన కలెక్షన్లకి వాస్తవ కలెక్షన్లకి చాలా తేడా ఉందని, కనీసం సగం కలెక్షన్లు కూడా లేవని బయ్యర్ల నుంచి, ఎగ్జిబిటర్ల నుంచి వినిపిస్తున్న టాక్. సినిమా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయితే దర్శకుడు అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై ప్రభావం చూపుతుందని, అలాగే దిల్‌రాజుకి ఫైనాన్స్ పరంగానూ ఇబ్బందులు తలెత్తుతాయని, హీరోల మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని కావాలని హిట్ అనే టాక్‌ని స్ప్రెడ్ చేస్తున్నారనే కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.
చాలా వరకు ఈ చిత్రాన్ని ఓ డీ గ్రేడ్ ఫిల్మ్ గానూ వర్ణిస్తున్నారు. ఓ పెద్ద స్టార్లని పెట్టుకుని ఇలాంటి చవకబారు కామెడీ చేయించారనే విమర్శలు క్రిటిక్స్ నుంచి, అటు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. ట్రోల్స్ కూడా చక్కర్లు కొడుతుండటం గమనార్హం. ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిశోర్, అలీ, రఘుబాబు, అన్నపూర్ణమ్మ, ప్రగతి ఇతర కీలక పాత్రల్లో మెప్పించిన విషయం తెలిసిందే.
