టాలీవుడ్ లో 2019కి మంచి శుభారంభాన్ని ఇచ్చిన F2 సినిమా విడుదలై 50 రోజులు పూర్తవుతున్నా రికార్డుల మోతను ఏ మాత్రం తగ్గించడం లేదు. సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసినా కూడా మాస్ థియేటర్స్ లో సినిమా ఇంకా నడుస్తూనే ఉంది. ఇకపోతే రీసెంట్ గా 52వ రోజు సినిమా సరికొత్త రికార్డు కొట్టడానికి సిద్ధమైంది. 

సింగిల్ థియేటర్ లో ఈ కామెడీ ఎంటర్టైనర్ మొత్తంగా కోటి రూపాయలను వసూలు చేయడానికి సిద్ధమైంది. ఆర్టిస్ క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో సరికొత్త రికార్డ్ ను అందుకోవడానికి ఇంకా కొంచెం ధురంలోనే ఉంది. సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 80కోట్ల షేర్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్ తో దిల్ రాజుకి చాలా రోజుల తరువాత లాభాలు వచ్చాయి. 

వరుణ్ తేజ్ - వెంకటేష్ కెరీర్లకె కాకుండా హీరోయిన్స్ కు కూడా సినిమా కెరీర్ లోనే బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా గుర్తుండిపోయేలా చేసింది.ఈ రోజుల్లో 10 రోజుల కంటే ఎక్కువగా కనిపించని సినిమాలు వీకేస్తున్న తరుణంలో F2 ఆఫ్ సెంచరీ కొట్టి డైరెక్టర్ అనిల్ కి కూడా భారీ ఆఫర్స్ ను అందుకునేలా చేసింది.