ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల హవా పెరగడం, స్టార్ హీరోయిన్లు కాస్త సీనియర్ హీరోయిన్లుగా మారడంతో కాజల్, తమన్నా, రకుల్ వంటి హీరోయిన్లకు అవకాశాలు తగ్గాయి. దీంతో తమన్నా ఈ ఏడాది పెళ్లి చేసుకుందామని అనుకుంది.

ఈ విషయాన్ని చూచాయిగా మీడియాకు కూడా చెప్పింది. కానీ ఆమె నటించిన 'ఎఫ్ 2' సినిమా హిట్ అవ్వడంతో సెకండ్ ఇన్నింగ్స్ పై ఆశలు పెంచుకుంది మిల్కీబ్యూటీ. ఈ సినిమా దెబ్బకి ఆమెకి సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో ఇక పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసింది.

అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పేసిందట. తాను ఎవరినీ ప్రేమించలేదని, ఇంట్లో చూసిన సంబంధమే చేసుకుంటానని గతంలో తమన్నా చెప్పింది.  ఇప్పుడు కొన్నాళ్లపాటు పెళ్లిని వాయిదా వేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తమిళంలో రెండు సినిమాల అవకాశాలు వచ్చాయని సమాచారం. అలానే చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో రాబోయే సినిమాలో హీరోయిన్ గా తమన్నా పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈమె 'సై రా' సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది.