కరోనా వల్ల తమ మ్యారేజ్‌ పోస్ట్ పోన్‌ అవుతూ వస్తోందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన మెహరీన్‌ ఇప్పుడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. తాను ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నట్టు సంచలన ప్రకటన చేసింది.

`ఎఫ్‌2` భామ మెహరీన్‌ తన ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది. ఇటీవల ఆమె హర్యానాకి చెందిన మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల తమ మ్యారేజ్‌ పోస్ట్ పోన్‌ అవుతూ వస్తోందని ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన మెహరీన్‌ ఇప్పుడు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. తాను ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకున్నట్టు తెలిపారు. ఇకపై భవ్యతోగానీ, వారి ఫ్యామిలీతోగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది మెహరీన్‌.

ఇందులో మెహరీన్‌ చెబుతూ, `భవ్య బిష్ణోయ్‌, నేను ఎంగేజ్‌మెంట్‌కి బ్రేక్‌ ఆఫ్‌ చేయాలనుకుంటున్నాం. మేం పెళ్లి వరకు వెళ్లడం లేదు. ఇది ఇద్దరం కలిసి, మా ఇష్ట పూర్వకంగా తీసుకున్న నిర్ణయం. మున్ముందు భవ్య బిష్ణోయ్‌తోగానీ, వారి ఫ్యామిలీతోగానీ, ఫ్రెండ్స్ తోగానీ ఎలాంటి సంబంధాలు కొనసాగించాలనుకోవడం లేదు.

ఇది పూర్తిగా మా ప్రైవేట్‌ మ్యాటర్‌. ఈ విషయంలో మా ప్రైవసీని గౌరవించండి. దీన్ని అందరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇకపై నేను సినిమాల్లో కొనసాగుతాను. మరిన్ని సినిమాల్లో నా బెస్ట్ అవుట్‌పుట్‌ ఇస్తాను` అని తెలిపింది మెహరీన్‌. ప్రస్తుతం మెహరీన్‌ `ఎఫ్‌3`తోపాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది.

Scroll to load tweet…