ఆసుపత్రి బెడ్ పై బోల్డ్ బ్యూటీ ఇషా గుప్తా.. సమంత తరహాలో చికిత్స, అరుదైన వ్యాధి సోకిందా ?
ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తా అందాల ఆరబోతలో రెచ్చిపోయినంతగా మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాదు. ఎప్పుడూ హాట్ అండ్ ఫిట్ గా కనిపించే ఇషా గుప్తా అనారోగ్యానికి గురైంది.

ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తా అందాల ఆరబోతలో రెచ్చిపోయినంతగా మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాదు. సోషల్ మీడియా ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది.
ఎప్పుడూ హాట్ అండ్ ఫిట్ గా కనిపించే ఇషా గుప్తా అనారోగ్యానికి గురైంది. ఆమె హాస్పిటల్ లో ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని చికిత్స పొందుతున్న పిక్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. దీనితో ఇషా గుప్తాకి ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. ఇషా గుప్తా ఏదో అరుదైన వ్యాధితో భాదపడుతున్నట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
దానికి కారణం ఆమె చేసిన కామెంట్స్. తాను హైపర్బెరిక్ థెరపీ చేయించుకుంటున్నట్లు ఇషా గుప్తా సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొంది. దీనితో సమంత తరహాలోనే ఈమెకి కూడా కండరాల సమస్య ఉందా అని చర్చించుకుంటున్నారు.
సమంత మయోసైటిస్ అనే కండరాల వ్యాధికి గురైనప్పుడు ఈ తరహా చికిత్స తీసుకుంది. ఈ థెరపీ వల్ల కండరాల నొప్పులు, వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతుందట. దీనితో ఇదే తరహా ట్రీట్మెంట్ ఇషా గుప్తా చేయించుకుంటుండడంతో.. ఆమె కూడా సమంత తరహాలో కండరాల వ్యాధికి గురైందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇషా గుప్తా పూర్తిగా ప్రస్తావించలేదు. మరి ఇషా గుప్తా దేనికోసం ఈ చికిత్స తీసుకుంటుందో క్లారిటీ రావాలంటే స్వయంగానే ఆమే స్పందించాలి.