దక్షిణాది దర్శకుల్లో గౌతం మీనన్ కి మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అధ్బుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఆయన సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా పూర్తిగా ప్రేక్షకులను నిరాశ పరిచినవి కావు.. తన సినిమాల్లో ఏదొక స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటాడు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను రూపొందించారు.

అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలని ఫైనాన్షియర్ల గొడవలు వస్తున్నాయి. దీనికారణంగా చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అతడు డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కాకుండా ఆగిపోయాయి. అతడు నిర్మాణ భాగస్వామిగా ఉన్న మరో రెండు సినిమాలకు కూడా బ్రేక్ పడింది. ఫైనాన్షియర్లతో గొడవల కారణంగానే వీటికి బ్రేక్ పడింది. 

ఇక ఇప్పట్లో గౌతం నుండి సినిమా వచ్చే ఛాన్స్ లేదని అందరూ అనుకుంటున్నా సమయంలో అతడు డైరెక్ట్ చేసిన ఓ సినిమాకి ఇప్పుడు మోక్షం లభించింది. ధనుష్ హీరోగా మూడేళ్ల క్రితం గౌతం మీనన్ 'ఎన్నై నొక్కి పాయుం తోటా' అనే సినిమాను మొదలుపెట్టాడు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అప్పట్లో మంచి క్రేజ్ నెలకొంది. ఆరు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

కానీ సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఫైనల్ గా ఇష్యూ సెటిల్ చేసుకొని సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ నెల 26న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.