Asianet News TeluguAsianet News Telugu

`అత్యాచార` ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు పీరల్‌కి ఏక్తా కపూర్‌ మద్దతు..సంచలన వ్యాఖ్యలు

మైనర్‌ బాలికపై అత్యాచారం, వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు పీరల్‌ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఆ బాలిక తల్లినే స్వయంగా తెలిపింది. దీంతో అక్రమంగా పీరల్‌ని కేసులో ఇరికించారని హిందీ టీవీ రంగం పరల్‌కి మద్దతుగా నిలుస్తుంది. 

ekta kapoor sensational comments on sexual allegation on tv actor pearl v puri  arj
Author
Hyderabad, First Published Jun 6, 2021, 2:25 PM IST

మైనర్‌ బాలిక అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటుడు పీరల్‌ వీ పూరికి నిర్మాత ఏక్తా కపూర్‌ మద్దతుగా నిలిచింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని, పరల్‌ని బలిపశువుని చేస్తున్నారని తెలిపింది. నిజంగానే ఓ బాలికకి అత్యాచారం జరిగితే నేను ఎందుకు సమర్ధిస్థాను అని తెలిపింది. మైనర్‌ బాలికపై అత్యాచారం, వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు పీరల్‌ వీ పూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఆ బాలిక తల్లినే స్వయంగా తెలిపింది. దీంతో అక్రమంగా పీరల్‌ని కేసులో ఇరికించారని హిందీ టీవీ రంగం పరల్‌కి మద్దతుగా నిలుస్తుంది. 

దీనిపై నిర్మాత ఘాటుగా స్పందించింది. `ఓ బాలిక మీద అత్యాచారం చేసినవాడికి నేను మద్దతిస్తానా? లైంగిక వేధింపులకు గురి చేసేవారికి అండగా నిలబడతానా? కానీ నిన్నరాత్రి నుంచి నాకు ఎదురైన పరిస్థితులు చూస్తుంటే మానవత్వం మంటగలిసినట్లు అనిపిస్తోంది. మరీ ఇంత దిగజారుతారా? ఇద్దరి మధ్య గొడవలుంటే అందులోకి మూడో వ్యక్తిని అన్యాయంగా లాగడమేంటి? ఓ మనిషి పట్ల మరో సాటి మనిషి ఇలా ఎలా చేయగలడు?` అని ప్రశ్నించింది. 

`మైనర్‌ బాలికతో నేను చాలా సార్లు మాట్లాడాను. పీరల్‌ అమాయకుడని, అతడికి, ఈ కేసుకి సంబంధం లేదని తెలిపింది. తన భర్తే కావాలని అతడిని ఇరికిస్తున్నాడని వెల్లడించింది. సెట్‌లో పనిచేసే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇదంతా చేస్తున్నాడని తెలిపింది. ఇదే నిజమైతే చాలా ఘోరమైన మిస్టేక్‌ చేస్తున్నాడని చెప్పొచ్చు. `మీ టూ`ను అడ్డుపెట్టుకుని స్వప్రయోజనాల కోసం చిన్నారిని మానసికంగా హింసిస్తూ ఓ అమాయక వ్యక్తిని దోషిగా నిలబెట్టాలని చూడటం అత్యంత దారుణం. ఈ ఘటనలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేల్చేందుకు నాకెలాంటి హక్కు లేదు. ఆ విషయం న్యాయస్థానమే చూసుకుంటుంది. కానీ బాలిక తల్లి చెప్పినదాని ప్రకారం.. పిరల్‌ ఏమీ తెలియని అమాయకుడని స్పష్టమవుతోంది. 

ఇక ఉద్యోగం చేసుకునే మహిళలు పిల్లలను సరిగా చూసుకోలేరని నిరూపించేందుకు ఇలాంటి చెత్త ప్రయత్నాలు చేయడం నిజంగా బాధాకరం. పీరల్‌ మీద మోపిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేసేందుకు నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి. మిగతా ఇండస్ట్రీస్‌లాగానే చిత్ర పరిశ్రమ కూడా చాలా వరకు సేఫ్‌. అయితే ఇందులో కొంత సేఫ్‌ కాకపోవచ్చు. కానీ సొంత ప్రయోజనాల కోసం చిత్రపరిశ్రమకు చెడ్డ పేరు తీసుకురావడం అనేది అత్యంత నీచమైన పని` అని ఏక్తా కపూర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనికి టీవీ రంగ నటీనటులు మద్దతు పలుకుతున్నారు. పీరల్‌కి అండగా నిలుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios