సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ నటిస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట ఈ సినిమాను దిల్ రాజు నిర్మాతగా అనౌన్స్ చేశారు. కానీ దర్శకుడు వంశీ పైడిపల్లి కారణంగా పివిపి కూడా నిర్మాతగా జాయిన్ అయ్యాడు.

ఇక మహేష్ గతంలో ఇచ్చిన మాట కోసం అశ్వనీదత్ ని ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చాడు. ఆ విధంగా సినిమాకు మొత్తం ముగ్గురు నిర్మాతలు. అయితే ప్రాజెక్ట్ విషయంలో ఈ ముగ్గురు నిర్మాతల మధ్య అభిప్రాయాలు కుదరకపోవడం, అలానే కొన్ని ఈగో ఇష్యూలు రావడం జరుగుతున్నాయట.

ఇక ఈ మధ్య కాలంలో దిల్ రాజు సినిమాకు తానే అసలైన నిర్మాత అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారట. మీడియా ముందు, బయట 'మహర్షి' సినిమా తన సినిమా అన్నట్లుగా దిల్ రాజు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ విషయం మిగిలిన ఇద్దరు నిర్మాతలకు నచ్చడం లేదట. దీంతో విషయాన్ని మహేష్ దగ్గరకి తీసుకువెళ్లినట్లు సమాచారం. దిల్ రాజు గురించి మహేష్ వద్ద కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.

వీరి మధ్య గొడవల కారణంగా సినిమా బిజినెస్ వ్యవహారాలు కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో మహేష్ బిజినెస్ కి సంబంధించిన విషయాలలో కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తోందని సమాచారం. ప్లానింగ్ లో లోపాల కారణంగానే ఏప్రిల్ మొదటి వారంలో రావాల్సిన సినిమా నాల్గో వారానికి వెళ్లిందని అంటున్నారు.