టాలీవుడ్ లో ఎక్కువగా నార్త్ లేదా ఇతర భాషల హీరోయిన్లదే హవా. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు హీరోయిన్లు మాత్రం రాణించలేకున్నారు. వారికి అవకాశాలు రావడం లేదు అని మంచు లక్ష్మీ కామెంట్స్ చేసింది. చూస్తుంటే ఈ వాదన క్రమంగా బలపడుతోంది అనిపిస్తోంది. తాజాగా అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ టాలీవుడ్ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో ఎక్కువగా నార్త్ లేదా ఇతర భాషల హీరోయిన్లదే హవా. కానీ ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు హీరోయిన్లు మాత్రం రాణించలేకున్నారు. వారికి అవకాశాలు రావడం లేదు అని మంచు లక్ష్మీ కామెంట్స్ చేసింది.
చూస్తుంటే ఈ వాదన క్రమంగా బలపడుతోంది అనిపిస్తోంది. తాజాగా అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు మేకర్స్ చూపు ఎప్పుడూ తమిళం, మలయాళీ, హిందీ హీరోయిన్లపైనే ఉంటుంది. నేను తమిళం, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నా.

అక్కడ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు తెలుగు సినిమా స్టామినా గురించి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా అనిపించింది. కానీ ఇక్కడ మేకర్స్ మాత్రం తెలుగు తెలియని హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు..ఇతర పాత్రలకి కూడా నార్త్ వాళ్లనే తీసుకుంటున్నారు. ప్రతిభ ఉన్న నటీనటులు తెలుగులో చాలా మంది ఉన్నారు. వారందరిని పక్కన పెట్టేస్తున్నారు అని ఈషా రెబ్బా వాపోయింది.
ఈషా రెబ్బా అమీతుమీ, అరవింద సమేత, రాగాల 24 గంటల్లో లాంటి చిత్రాలతో ప్రతిభ చాటుకుంది. అయితే సరైన గ్లామర్ పాత్ర మాత్రం ఆమెకి తెలుగులో దక్కలేదు. సోషల్ మీడియాలో ఈషా రెబ్బా గ్లామర్ ఫోజులకు యువత ఫిదా కావడం చూస్తూనే ఉన్నాం. తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా జెడి చక్రవర్తి సరసన దయ అనే చిత్రంలో నటిస్తోంది.
