Asianet News TeluguAsianet News Telugu

#Eagle:‘ఈగల్’ నిర్మాత విశ్వప్రసాద్ ఎవరిని ఉద్దేశించి ఈ వార్నింగ్.!

. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకర్ధం కాలేదు. 
 

Eagle Producer TG Vishwaprasad clarity about False Propaganda jsp
Author
First Published Feb 9, 2024, 5:56 AM IST


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్  నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా రిలీజ్ అవుతోంది.  రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.   ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ప్రొడక్షన్ హౌస్ లో జరిగే అవినీతి గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటుందో.. దాన్ని అరికట్టడానికి విశ్వప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో  చెప్పుకొచ్చాడు. అయితే అయన మాటలను ఇండస్ట్రీలో కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని,ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. దీంతో ఈ విషయమై విశ్వప్రసాద్ క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు.  

‘నేను యూనియన్ కార్మికులకు వ్యతిరేకం కాదు. వాళ్ళ కష్టాన్ని నా ధనాన్నీ దోచుకుంటున్నవారికి మాత్రమే నేను వ్యతిరేకం’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేసిన విశ్వప్రసాద్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. అవినీతికి పాల్పడనివారు ఎవరైనా తమ కంపెనీలో సగర్వంగా పనిచేయొచ్చని ఆయన పేర్కొన్నారు.  ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో ఏముంది అంటే...

“మా ఈగల్ సినిమా ప్రచారంలో భాగంగా ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా, నేను నా ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల, సినిమాలలో క్వాలిటీ ఎలా దెబ్బ తింటోందో చెప్పాను.. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో నేనెలాంటి ప్రతిచర్యలు చేపట్టాను అని మీడియా వారికి చెప్పడం జరిగింది. దీనికి భుజాలు తడుముకున్న కొందరు పరిశ్రమ వ్యక్తులు, నా వ్యాఖ్యలు వక్రీకరించి, నేనేదో కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్టు దుష్ప్రచారం చేయడం నా దృష్టికి వచ్చింది. పరిశ్రమలోని కొందరు వ్యక్తుల అవినీతి వల్ల, కష్టపడి పనిచేసే యూనియన్ కార్మికులకే నా డబ్బు అందడం లేదని నేనన్నాను.. నా కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి నేను చేసిన వ్యాఖ్యలతో బయటి వారికి సంబంధమేమిటో నాకర్ధం కాలేదు. 

నా సంస్థలో ఎవరికైనా జీతాలందకపోతే, వారు నేరుగా మాట్లాడి తీసుకుంటారు. యూనియన్ కి కంప్లైంట్ వస్తే ఛాంబర్ లో లేదా కౌన్సిల్ లో సాల్వ్ చేసుకుంటాం. ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కంపెనీ లో అవినీతి కి పాల్పడని వారంతా గర్వంగా పనిచేయవచ్చు.. అవినీతి పరులపై నేను లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నేను వారి కుటుంబాల గురించి ఆలోచించి వారిని వదిలేశాను. అది నా స్వంత నిర్ణయం.. బయటి వారికి సంబంధం లేదు..

నేను తీసిన ముప్ఫైకి పైగా సినిమాల్లో మూడు లక్షలకు పైగా కార్మిక సోదరుల కష్టం ఉంది.. మరో పాతిక సినిమాలు సెట్ మీదకొస్తున్నాయి. నేను యూనియన్ వర్కర్స్ కి వ్యతిరేకం కాదు.వాళ్ల కష్టాన్ని, నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే.. నేను ఏ అవినీతిపరుడికి లొంగిపోను.. నిజాయితీ ప్రబలుతుంది.. సినిమా కన్నా ఏ వ్యక్తి పెద్దది కాదు” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios