Asianet News TeluguAsianet News Telugu

`ఈగల్‌` కలెక్షన్లు.. రెండు రోజుల్లో రవితేజ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

రవితేజ ఈ శుక్రవారం `ఈగల్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయి. రెండో రోజుల్లో ఎంత చేసిందంటే
 

eagle movie collections raviteja movie how much getting in 2 days arj
Author
First Published Feb 11, 2024, 11:34 AM IST | Last Updated Feb 11, 2024, 3:09 PM IST

మాస్‌ మహారాజా రవితేజ తాజాగా `ఈగల్‌` సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. `రావణాసుర`, `టైగర్‌ నాగేశ్వరరావు` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ డిజాస్టర్ల తర్వాత ఇప్పుడు `ఈగల్‌` అంటూ వచ్చాడు. ఈ మూవీ స్టయిలీష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. సినిమాటోగ్రాఫర్‌ కార్తీక్‌ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫ్యాన్స్ బాగుందని చెబుతుంటే, సాధారణ ఆడియెన్స్ మాత్రం అంతగా కనెక్ట్ అయ్యేలా లేదంటున్నారు. 

కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం డీసెంట్‌గా రన్‌ అవుతుందీ మూవీ. తొలి రోజు సుమారు ఆరు కోట్ల షేర్‌ సాధించింది. 11.90కోట్ల గ్రాస్‌, 5.8కోట్ల షేర్‌ వచ్చింది. రవితేజ మూవీకిది డీసెంట్‌ ఓపెనింగ్‌ అనే చెప్పాలి. అయితే ఆయన క్రేజ్‌, రేంజ్‌తో పోల్చితే తక్కువే. కాకపోతే గత చిత్రాలు డిజాప్పాయింట్‌ చేయడంతో `ఈగల్‌` ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడింది. ఇక రెండో రోజు కూడా ఫర్వాలేదనిపించేలా సాగింది. 

రెండో రోజు ఈ మూవీ నాలున్నర కోట్ల షేర్‌ రాబట్టింది. ఏడు కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. మొత్తంగా పది కోట్ల షేర్‌ 17కోట్ల గ్రాస్‌ రావడం విశేషం. ఈ మూవీ 22కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. తాజాగా 45శాతం రికవరీ అయ్యింది. ఇంకా 12కోట్లు షేర్‌ అంటే 25కోట్ల గ్రాస్‌  వస్తేఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ అవుతుంది. ఆదివారం మరో ఐదారు కోట్ల షేర్‌ వచ్చే అవకాశం ఉంది. లాంగ్‌ రన్‌లో మూవీ ఆడితే బ్రేక్‌ ఈవెన్‌ అవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ సోమవారం నుంచి ఉండే ఆడియెన్స్ స్పందన బట్టి ఈ మూవీ హిట్టా ఫట్టా అనేది తెలుస్తుంది. 

`ఈగల్‌` మూవీలో రవితేజ హీరోగా నటించగా, కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటించింది. అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్ర పోషించింది. ఇంకా చెప్పాలంటే ఆమె పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే సినిమా సాగుతుంది. మధు బాల, శ్రీనివాస్‌ అవసరాల, అజయ్‌ ఘోష్‌లు కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios