ధనుష్ దర్శకుడితో సినిమాకు రెడీ అవుతున్నాడు మలయాళ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో .. దుల్కర్ సల్మాన్. అది కూడా టాలీవుడ్ లో చాలా పెద్ద... పేరున్న బ్యానర్ లో.

పాన్ ఇండియా లెవల్లో తెలుగు దర్శకుల హవా పెరిగిపోతుంది. ఇతర భాషల హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలంటే పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్, దుల్కర్ , షాహిద్ కపూర్, లాంటి స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేసి హిట్లు కొట్టారు. ఇక అదే ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది.. ఒక రకంగా పెరుగుతుంది కూడా. ఈక్రమంలో ధనుష్ తో సినిమా చేసి హిట్ కొట్టిన తెలుగు దర్శకుడితో.. దుల్కర్ సల్మాన్ సినిమా చేయబోతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో చాలా పెద్ద... పేరున్న బ్యానర్ లో. 

మలయాళ స్టార్ మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. ఓకే బంగారం సినిమాతో టాలీవుడ్ లో రిజిస్టర్ అయ్యాడు. ఇక మహానటి సినిమాతో టాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు హ్యాండ్సమ్ హీరో. ఇక టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ కోసం దుల్కర్ చేసిన ప్రయత్నం ఫలించింది. గత ఏడాది సీతారామం సినిమా దుల్కర్ కు తిరుగులేని ఇమేజ్ ను తీసుకువచ్చింది. అంతే కాదు టాలీవుడ్ లో మంచి మార్కెట్ కూడా సంపాదించి పెట్టింది. 

Scroll to load tweet…

తెలుగు మిడ్‌ రేంజ్‌ హీరోలకు సమానంగా దుల్కర్‌ సినిమాలకు ఇక్కడ క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం దుల్కర్‌ కింగ్ ఆఫ్‌ కొత అనే మలయాళ సినిమా చేస్తున్నాడు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో రిలీజ్‌ కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా దుల్కర్‌ మరో తెలుగు సినిమాకు కమిట్‌ అయ్యాడు. అది కూడా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరితో. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్ తో సార్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఈక్రమంలో ఆయన నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్న క్రమంలో దుల్కర్‌ తో తన తదుపరి సినిమా అనౌన్స్ చేశాడు యంగ్ డైరెక్టర్ .

బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో జోరుమీదున్న.. తెలుగు నిర్మాణ సంస్థ సితార ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. తాజాగా మేకర్స్‌ఉ ఈ కాంబోపై అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మేరకు వెంకీ అట్లూరి, దుల్కర్‌ సల్మాన్‌, నాగవంశీ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ 2023, అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.