రానా సీన్ లోకి వచ్చాడండే... 'కాంతారా' లా సమ్ థింగ్ ఉంటుంది
కాంత చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రచన & దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.

దుల్కర్ సల్మాన్ హీరోగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకి సంబంధించిన ఎనౌన్సమెంట్ వచ్చేసింది. దుల్కర్ ఇప్పుడు బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానాతో ‘కాంత’ అనే సినిమా చేయనున్నారు. దుల్కర్ ‘కాంత’ సినిమాలో హీరోగా నటించనుండగా రానా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన గతంలో ఎన్నడూ నటించని పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన స్పిరిట్ మీడియా బ్యానర్ తో కలిసి తన వేఫేరర్ ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని అంటున్నారు.‘కాంత’ (Kaantha) అనే టైటిల్ ని ఈ మూవీకి ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
— Rana Daggubati (@RanaDaggubati) July 28, 2023
''చాలా అరుదుగా 'మంచి సినిమా' అనే భావన ను పెంచే కథ తో ఇది తెరకెక్కుతోంది. #కాంత అనేది మేధావుల ను ఏకతాటిపైకి చేర్చిన ప్రాజెక్ట్. అపారమైన ప్రతిభావంతుడు దుల్కర్ సల్మాన్ ... వేఫేరర్ ఫిలింస్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు DQ .. కాంతా ప్రపంచానికి స్వాగతం'' అంటూ రానా స్వయంగా సోషల్ మీడియా లో ఈ ప్రాజెక్టు ను ప్రకటించారు.
ఈ మూవీలో దుల్కర్ నటించడమే కాదు, నిర్మాణంలో కూడా రానాతో కలిసి చేతులు కలిపాడు. వేఫేరర్ ఫిల్మ్స్ అండ్ స్పిరిటి మీడియా బ్యానర్స్ ఈ మూవీని.. తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. తమిళ్ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.
ఇంతకీ ఎవరీ దర్శకుడు అంటే...
సెల్వమణి సెల్వరాజ్...2016లో ‘నిల’తో తొలిసారిగా అరంగేట్రం చేసి ‘లైఫ్ ఆఫ్ పై’లో అంగ్ లీకి సహాయ సహకారాలు అందించారు. అలగే సెల్వమణి నెట్‌ఫ్లిక్స్ లో త్వరలో రిలీజ్ అవుతున్న డాక్యుమెంటరీ సిరీస్ ‘హంట్ ఫర్ వీరప్పన్’కి కూడా దర్శకత్వం వహించాడు. దాంతో ఈ దర్శకుడుకు ప్రాజెక్టు ఓకే అవ్వటం ఈజీ అయ్యింది. మ రో ప్రక్క దుల్కర్ సల్మాన్ వరస పెట్టి విభిన్నమైన చిత్రాలు సైన్ చేస్తున్నాడు. ‘బెంగళూరు డేస్’, ‘కురుప్’, ‘ఓ కాదల్ కన్మణి’, ‘కార్వాన్’, ‘సీతా రామం’, ‘చుప్’ వంటి హిట్లు కొట్టిన ఆయన ఈసారి పాన్ ఇండియా అప్పీల్ తో వస్తున్నాడు. ఈ కాంత సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.