మలయాళ రొమాంటిక్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan), అదితి రావు హైదరీ తమ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం  హైదరాబాద్ లో అడ్డా వేశారు. ఈ సందర్భంగా  స్టైలిష్  లుక్ లో దుల్కర్.. ట్రెండీ వేర్ లో అదితి రావు అట్రాక్ట్ చేస్తున్నారు.   

మలయాళీ రొమాంటిక్ హీరో దుల్కర్ సల్మాన్ ఇక హైదరాబాద్ పై కన్నేశాడు. సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ‘కురుప్’ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన దుల్కర్ ఇప్పుడు సీనియర్ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం 'హే సినామిక'తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. ఈ చిత్రంలో అదితి రావు హైదరి (Aditi Rao Hydari), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మార్చి 3న మలయాళ, తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. తెలుగు ఆడియెన్స్ నూ తనవైపు తిప్పుకునేందుకు దుల్కర్ సల్మాన్ చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే ఈ మూవీలో ప్రత్యేకంగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న కాజల్ అగర్వాల్, హైదరాబాదీకి చెందిన అదితి రావు హైదరీని హీరోయిన్లుగా ఎంచుకున్నారు. రేపు ఈ సినిమా విడుదల కానుంది. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్, అదితిరావు హైదరీ రెండు రోజులుగా హైదరాబాద్ లోనే అడ్డా వేశారు. ‘హే సినామిక’ ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యనగరంలో షికారుచేశారు. నిన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేశారు. తెలుగులో తమ సినిమాను రిలీజ్ చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. హే సినామిక మూవీ తెలుగు ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) రిలీజ్ చేశారు. దీంతో మరింత మంది ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది.