కొన్ని వారాలుగా ఇంటి సభ్యులు గ్రూపులుగా విడిపోయారు. ముఖ్యంగా లాస్య, అభిజిత్ మరియు హారిక ఒక టీమ్ గా తయారై ఒకరికొకరు సహాయం చేసుకోవడం చేశారు. నామినేషన్స్ లో కూడా ఈ ముగ్గురు ఒకరినొకరు నామినేట్ చేసుకొనేవారు కాదు. బయటపడకుండానే నోయల్ ఈ గ్రూప్ ని నిర్మించిపోయాడు. హౌస్ లో ఉన్నంత కాలం అందరితో బాగున్నట్లు నటించినా, అవినాష్, అమ్మ రాజశేఖర్ అంటే తనకు ఎంత కోపమో తెలియజేశారు. ఒక విధంగా వాళ్ళను బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు. 

ఇక లాస్య హౌస్ నుండి వెళ్లిపోగా, మిగిలిన అభిజిత్ అండ్ హారిక థిక్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. కెప్టెన్ అయిన హారిక అభిజిత్ కోసమే పనిచేసింది. మోనాల్ ఇద్దరు మగాళ్లతో పోటీపడి హరికను చివరి వరకు మోసీ కెప్టెన్ చేసింది. నామినేషన్స్ లో అభిజిత్ ని సేవ్ చేయడం కోసం మోనాల్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ ప్రస్తావించిన నాగార్జున హారికకు పెద్ద క్లాస్ పీకారు. అభిజిత్ కనీసం టాస్క్ లు ఆడకపోతే చెప్పాల్సిన బాధ్యత కూడా హారిక తీసుకోలేదు. 

ఎప్పటిలాగే నోటి దురుసుతో నాగార్జునకు అభిజిత్ దొరికిపోయాడు. తప్పు మాట్లాడవని నాగార్జున చెప్పినప్పుడు ఒప్పుకోకుండా, వీడియో ప్రూఫ్స్ చూపించాక సారీ చెవుతూ మరింత బద్నామ్ అయ్యాడు. నిన్న ఎపిసోడ్ హారిక, అభిజిత్ ల గ్రాఫ్ తగ్గించేసింది. ఎవరి గేమ్ వారు ఆడకుండా వీరిద్దరూ ఒకరికి మరొకరు సహాయం చేసుకుంటూ, అనారోగ్య పూరిత వాతావరణం సృష్టించారు. ఇంకా కేవలం మూడు వారాలలో షో ముగియనుండగా, హారిక, అభిజిత్ లు ఏదశ వరకు వెళ్లనున్నారో చూడాలి.