Asianet News TeluguAsianet News Telugu

వెంకీ ‘దృశ్యం 2’ హాట్ స్టార్ లో, రిలీజ్ డేట్ ఇదే

అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో రూపొందించిన రూపొందిన సినిమానే దృశ్యం-2. 

Drushyam 2 Release Date On Hotstar jsp
Author
Hyderabad, First Published Jul 23, 2021, 9:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నారప్ప జూలై 20 న నేరుగా ఓటీటిలో రిలీజైంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన అసురన్‌ మూవీకి నారప్ప రీమేక్‌. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మంచి క్రేజే తెచ్చుకుంది.  దీనితో పాటు ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం.‘దృశ్యం 2’ అయితే శాటిలైట్‌, డిజిటల్‌, డైరెక్ట్‌-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్‌ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అయ్యినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌. ఆయన కీలక పాత్రలో 2013లో వచ్చిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘దృశ్యం’. థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇతర భాషల్లోనూ కాసుల వర్షాన్ని కురిపించింది. దానికి కొనసాగింపుగా వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం2’. ఆ మధ్యన అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసారు.

 వెంకటేశ్‌-మీనా జంటగా రానున్న ఈ చిత్రానికి మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. కరోనా సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తూ ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ చేసారు. సెప్టెంబర్ 9న లేదా 10న ఈ చిత్రం వినాయక చవతి రోజున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. వినాయక చవతి పండుగ రోజు రిలీజ్ అయితే ఫ్యామిలీ అంతా కలిసి చస్తారని ఆ రోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినపడుతోంది. అయితే అఫీషియల్ గా ఈ డేట్ ని లాక్ చేసినట్లు  ప్రకటన ఏమీ రాలేదు. వచ్చే నెలలో వచ్చే అవకాసం ఉంది.

ఇక ఈ సీక్వెల్ చిత్రంలో ...వరుణ్‌ కనిపించకుండా పోయిన కేసు నుంచి బయటపడిన  వెంకటేష్ ,మీనా కుటుంబం ఉన్నత జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ స్థాయి నుంచి థియేటర్‌ ఓనర్‌గా, ఓ సినిమాను నిర్మించే స్థాయికి ఎదుగుతాడు వెంకటేష్‌. అయితే వరుణ్‌ కేసు తాలూకు భయాలు మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. మరోవైపు వరుణ్‌ను వెంకటేషే చంపి ఉంటాడని ఊళ్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. పోలీసులకు అదే అనుమానం ఉన్నా, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆ కేసును సీక్రెట్‌గా విచారిస్తుంటారు.  అదే సమయంలో ఐజీ   ఆ కేసును రీఓపెన్‌ చేస్తాడు. అప్పుడు వెంకటేష్ ఏం చేశాడు? కేసు రీఓపెన్‌తో వెంకటేష్ భార్య, పిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఈ కేసు నుంచి బయటపడ్డారా?కుటుంబం కోసం దాన్ని వెంకటేష్  ఎలా అధిగమించాడు? అనే విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది.

ఇటీవలే మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం2’ ప్రముఖ ఓటీటీ ఆమెజాన్‌లో విడుదలై విమర్శకుల ప్రసంశలు అందుకుంది. పార్ట్‌-3కి కూడా డైరెక్టర్‌ జీతూ స్క్రిప్ట్‌ను మలిచే పనిలో ఉన్నట్టు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు వెంకీ నటించిన  ‘ఎఫ్‌3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది

Follow Us:
Download App:
  • android
  • ios