ఈ సినిమాని  కొరియాలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. అక్కడి నిర్మాణ సంస్థ ఆంథాలజీ స్టుడియోస్ తో కలిసి పనోరమా స్టుడియోస్ ఈ సినిమాను కొరియన్ లో రీమేక్ చేయబోతున్నారు.


ఇన్నాళ్లకు మళ్లీ మన ఇండియన్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఎంతలా అంటే మన దేశీయ సినిమాల్ని విదేశీయులు రీమేక్ చేసే స్దాయికి ఎదిగాము. మన వెంకటేష్ చేసిన సూపర్ హిట్ సినిమాను కొరియన్ భాషలోకి రీమేక్ చేయబోతున్నారు. ఆ సినిమా మరేదో కాదు దృశ్యం. మలయాళంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యం ని తెలుగులో వెంకీ తో రీమేక్ చేసారు. వెంకటేశ్, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల‌్లో శ్రీ ప్రియ ఈ మూవీని రీమేక్ చేసింది. మళయాళం లో జీతూ జోసెఫ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా రీమేక్ అయిన ప్రతి భాషలో హిట్టయింది. ఏ భాషలో రీమేక్ చేసినా సక్సెస్ అయింది. ఆ తర్వాత దృశ్యం-2 వచ్చింది. అది కూడా మలయాళంలో పెద్ద హిట్టయింది. ప్రతి రీమేక్ సక్సెస్ అయింది.

అందుకే, ఈ సినిమాని కొరియాలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. అక్కడి నిర్మాణ సంస్థ ఆంథాలజీ స్టుడియోస్ తో కలిసి పనోరమా స్టుడియోస్ ఈ సినిమాను కొరియన్ లో రీమేక్ చేయబోతున్నారు. ఈ మేరకు కేన్స్ చిత్రోత్సవంలో అధికారిక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు రివీల్ చేస్తారు. 

చిత్రం కథేమిటంటే...తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.