విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దొరసాని అనే ఆ సినిమాలో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కాంబో పై మొదటి నుంచి మంచి బజ్ ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సైలెంట్ గా వర్క్ చేసుకుంటోంది. 

అలాగే ప్రమోషన్స్ డోస్ కూడా పెంచడం లేదు. ఈ సినిమా ద్వారా కెవిఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ యష్ రాగినేని - మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. 

అయితే సినిమాను జులై 5న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబందించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నారు. రెండు ఈవెంట్స్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యే విధంగా సిద్దమవుతున్నట్లు టాక్. మరి తమ్ముడి సినిమా కోసం విజయ్ దేవరకొండ ఎలాంటి ప్రమోషన్స్ చేస్తాడో చూడాలి.