టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే రీసెంట్ గా ప్రివ్యూ షోని ప్రదర్శించిన చిత్ర యూనిట్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సినిమా హార్ట్ టచింగ్ గా ఉందంటూ బెస్ట్ లవ్ స్టోరీ అని కామెంట్ చేశారు. 

టాలీవుడ్ లో పలువురు యువ దర్శకులతో పాటు కొంత మంది సినీ నటులు కూడా దొరసాని స్పెషల్ షోని వీక్షించారు. 1980ల కాలంలో జరిగే దొరసాని కథ ట్రూ అండ్ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ గా ఆడియెన్స్ ఆకట్టుకుంటుందట. ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయని చెబుతున్నారు. ఒక నిజాయితీగల ప్రేమకు ప్రతిరూపమే దొరసాని అని ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా అని వారి వివరణ ఇస్తున్నారు. 

మొత్తానికి ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ వారి మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నట్లు తెలుస్తోంది. దొరసానికి అందుతున్న పాజిటివ్ టాక్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.