ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన దొరసాని టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలను రేపిన ఈ సినిమా ఇప్పుడు టీజర్ తో మరింతగా బజ్ క్రియేట్ చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో దొరల కాలం నాటి అంశాలను బేస్ చేసుకొని దర్శకుడు కెవిఆర్. మహేంద్ర లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించాడు.

దొరసాని ప్రేమ కోసం ఒక సాధారణ యువకుడు పడే తాపత్రయం సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. కోటాలో రాణి.. తోటలో రాముడు కథే అయినప్పటికీ మేకింగ్ మాత్రం చాలా కొత్తగా అనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ సింపుల్ యాక్టింగ్ శివాత్మిక హావభావాలు సినిమాపై అంచనాలను రేపుతున్నాయి. జులై 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.