ప్రముఖ క్రికెటర్ ధోనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిన్న జరిగినే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లో ఇండియా ఓడిపోయిన కారణంగా ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపించాయి.

దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇది ఇలా ఉండగా.. ప్రముఖ  గాయని లతా మంగేష్కర్ తన తరఫున ధోనీని రిక్వెస్ట్ చేస్తున్నారు.ధోనీ రిటైర్మెంట్ వార్తలు విన్న ఆమె అలాంటి ఆలోచన రానివ్వదంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

''నమస్కారం ధోనీ గారు.. మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నట్లు విన్నాను.. దయచేసి ఆ పని మాత్రం చేయొచ్చు.. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. రిటైర్మెంట్ అనే ఆలోచన రానివ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నా'' అంటూ రాసుకొచ్చారు. ఆమె ట్వీట్ కి అభిమానుల నుండి ఎంతో సపోర్ట్ లభిస్తోంది.