అకీరాను జూనియర్ పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా: రేణుదేశాయ్

don't call him jr pawar star says renu desai
Highlights

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన కొడుకు, కూతురు ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తన కొడుకు, కూతురు ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇటీవల తనను ప్రేమించే వ్యక్తి దొరికాడంటూ ఓ ఫోటో పోస్ట్ చేసిన రేణు తాజాగా తన కొడుకు అకీరా ఫోటోను పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో అకీరా దేనికోసమో వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో అభిమానులతో పంచుకుంటూ రేణు ఓ కామెంట్ కూడా పెట్టింది.

''నా క్యూటీ చూడడానికి యూరోపియన్ సినిమాలో ఓ సీరియస్ క్యారెక్టర్ లా కనిపిస్తున్నాడు. తన ల్యాప్ టాప్ లో గేమ్ కోసం వెతుకుతున్నాడు(ఎవరైనా జూనియర్ పవర్ స్టార్ అని కామెంట్ చేస్తే గనుక వారిని నా అసిస్టెంట్ బ్లాక్ చేస్తాడు). జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం అకీరాకు, వాళ్ల నాన్నకు, నాకు ఇష్టం లేదు. కాబట్టి అలా పిలవడం ఆపండి'' అని ఘాటుగా చెప్పుకొచ్చింది. 

loader