మీడియా వార్తలు ఎలా ఉన్నా, కోలీవుడ్ వర్గాలు ఏమనుకుంటున్నా డోంట్ కేర్ అంటూ నయన, విగ్నేష్ నచ్చినట్లుగా బ్రతికేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. పెళ్లి కాకపోయినా ఒకరికిఒకరుగా, వీడలేనంతగా వీరి బంధం సాగుతుంది. 


కోలీవుడ్ లవ్ బర్డ్స్ విగ్నేష్ శివన్, నయనతార ఎప్పుడూ వార్తలలో ఉంటారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నా, డిమాండ్ రీత్యా మీడియా వాళ్ళ గురించి ఏదో ఒక వార్త రాస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విగ్నేష్, నయనతార పెళ్లి పైనే ఎక్కువగా కథనాలు వెలువడుతూ ఉంటాయి. ఎటువంటి అధికారిక సమాచారం లేకున్నా వాళ్లిద్దరూ పెళ్లికి సిద్ధం అంటూ వార్తలు వండివారుస్తూ ఉంటారు. 


ఇక మీడియా వార్తలు ఎలా ఉన్నా, కోలీవుడ్ వర్గాలు ఏమనుకుంటున్నా డోంట్ కేర్ అంటూ నయన, విగ్నేష్ నచ్చినట్లుగా బ్రతికేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. పెళ్లి కాకపోయినా ఒకరికిఒకరుగా, వీడలేనంతగా వీరి బంధం సాగుతుంది. పెళ్లి మాత్రమే జరగలేదు కానీ, ప్రతి విషయాన్ని దంపతుల మాదిరే జరుపుకుంటారు ఈ జంట.


పండగలు పబ్బాలు, విందులు వినోదాలు, విహారాలు ఏదైనా కలిసి చేయాల్సిందే. ఇక బర్త్ డే పార్టీలు కోసం ప్రత్యేకమైన ప్రదేశాలకు చెక్కేస్తారు. ఇద్దరిలో బర్త్ డే ఎవరిది అయినా స్పెషల్ గా జరుపుకుంటారు. లోకానికే కన్నుకుట్టుకునేలా సాగుతున్న వీరి ప్రేమాయణంలో అనేక మజిలీలు ఉన్నాయి. 


అయితే వీరి ప్రేమ బంధంలో ఓ ఆసక్తికర విషయం ఒకటి ఉంది. నయనతార విగ్నేష్ కంటే వయసులో పెద్దది అట. దాదాపు పది నెలలు నయనతార విగ్నేష్ కంటే వయసులో పెద్ద అని తెలుస్తుంది. గ్లామర్ ఫీల్డ్ లో అదేమీ పెద్ద విషయం కాదు. మహేష్ బాబు ఏకంగా తనకంటే నాలుగేళ్లు పెద్దదైన నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రియాంక పేడేళ్లు చిన్నవాడైన నిక్ ని వివాహం చేసుకుంది.