Asianet News TeluguAsianet News Telugu

మ‌ల‌యాళ హిట్ తెలుగు రీమేక్‌లో డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నల గడ్డ, వరస సినిమాలతో జోరు పెంచిన హీరో

డీజే టిల్లు సినిమాతో మాస్ నుంచి ఊరమాస్ ఇమేజ్ సాధించాడు టాలీవుడ్ యంగ్ హీరో సిద్థు జొన్నల గడ్డ. ఈ సినిమా తరువాత మనోడు వరుస సినిమాలు లైన్ అప్ చేసుకుంటున్నాడు. తాజాగా టిల్లు ఖాతాలో మలయాళ రీమేక్ మూవీ కూడా సెట్ అయినట్టు తెలుస్తోంది. 

DJ Tillu Hero Siddu Jonnalagadda in malayalam hit Remake
Author
First Published Sep 1, 2022, 2:19 PM IST


టాలీవుడ్ లో యంగ్ హీరోలలో ఊరమాస్ ఎవరంటే.. వెంటనే వినిపించే పేరు సిద్ధు జొన్నల గడ్డ. డీజే టిల్లు  సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్  హిట్టు కొట్టాడు ఈ యంగ్  హీరో.  విమ‌ల్ కృష్ణ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన‌ ఈ మూవీ  సూపర్ సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్‌కు మంచి ఎన‌ర్జీ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాతో టీమ్ అందరికి ఫుల్ జోష్ వచ్చింది. అందుకే వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని ప్రకటించేశారు. త్వరలో  డీజేటిల్లు 2 కి సంబంధించి మంచి అప్ డేట్ కూడా ఇవ్వబోతున్నారట. 

ఇక అసలు విషయానికి వస్తే.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డకు సంబంధించి ప్రస్తుతం మరో బ్రేకింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సిద్థు హీరోగా ఓ మలయాళ హీట్ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కబోతుంది. మ‌ల‌యాళ స్టార్ హీరో టొవినో థామ‌స్ లీడ్ రోల్‌లో న‌టించిన‌ హిట్ సినిమా థ‌ళ్లుమాలను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారట. .. ఇందులో డిజే టిల్లు స్టార్  లీడ్ రోల్ చేయ‌బోతున్నాడ‌ట‌.  అయితే ఈ న్యూస్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ యంగ్  స్టార్ డైరెక్ట్ చేయబోతున్నట్టు కూడా హింట్ ఇస్తున్నారు టీమ్. మరి ఈ సినిమాకుప్రొడ్యూసర్ ఎవరు.. ఇతర నటీనటులు.. టెక్నికల్ టీమ్ కు సంబంధింన వివరాలు త్వరలో వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ముందుగా తెరకెక్కబోతున్న డీజే టిల్లు 2 సినిమాను మాత్రం  సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్  బ్యాన‌ర్ల‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను  మ‌ల్లిక్ రామ్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ని టాక్. ఈ రెండు ప్రాజెక్ట్  లపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios