చాలారోజులుగా సస్పెన్స్ లో ఉన్న డిజే టిల్లు పార్ట్ 2 మూవీ షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయ్యింది. టీమ్ లో వచ్చిన అభిప్రాయ భేదాలు.. హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడం.. ఈ సమస్యలన్నింటిని అధిగమించి  సినిమాను స్టార్ట్ చేశారే మేకర్స్.

ఎట్టకేలకు డీజే టిల్లు సీక్వెల్ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫస్ట్ సీన్ ను జిల్ జగేలుమనిపించేలా.. కారు సీన్‌తో షూటింగ్‌ స్టార్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. డిజే టిల్ల ఫస్ట్ పార్ట్ మూవీ కిక్కు తగ్గకముందే.. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. రిలీజ్ చేయాలని చూస్తున్నారు టీమ్. ఈ విషయంలో హీరో సిద్థు జొన్నల గడ్డ మంచి ఊపు మీద ఉన్నాడు. 

వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
పీడీవి ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్ట్‌టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ సీక్వెల్ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధూనే క‌థ‌ను అందించడం విశేషం. అయితే ఈ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. తేజ్ సజ్జా హీరోగా.. అద్భుతం సినిమాను డైరెక్ట్ చేసిన మల్లిక్‌ రామ్‌ డీజే టిల్లు పార్ట్‌-2ను రూపొందిస్తున్నాడు. డిజే టిల్లు ఫస్ట్ పార్ట్ ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ తో హీరో సిద్థుకు బేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో ఆయన ఈసినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. 

Scroll to load tweet…

అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయిన పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల కూడా సినిమానుంచి తప్పుకున్నట్టు న్యూస్ వైరల్ అయ్యింది. మరి హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇవ్వకుండానే.. పార్ట్ 2 మూవీ షూటింగ్ను స్టార్ట్ చేశారు టీమ్. ఎన్నో ఏళ్ళుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ టైమ్ లో ఈ యంగ్ హీరోకు డీజే టిల్లు మూవీ మంచి బ్రేక్‌ ఇచ్చింది. కరోనా టైమ్ తరువాత పెద్ద సినిమాలే భయపడుతున్న టైమ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి.. టాలీవుడ్ ను ముందుకు నడిపించింది. 

ఈ ఏడాది మార్చి 12 విడుదలైన డీజే టిల్లుగాడు.. టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. . ఫ‌స్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వ‌సూళ్ళను సాధించి ఔరా అనిపించాడు. ఈమూవీతో సిద్ధూ జొన్నలగడ్డ నటన, తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పే డైలాగ్స్‌ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించాయి. అంతే కాదు ఈ మూవీతో మరీ ముఖ్యంగా యూత్‌లో సిద్ధూకు ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కమర్షియల్‌గానూ ఈ మూవీ భారీ కలెక్షన్లను సాధించింది.