డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు కేవలం 17 కోట్లకు మాత్రమే అమ్ముడయ్యాయి. కాగా రెండు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ 12 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఇస్మార్ట్ శంకర్ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ కాబోతోందని. 

ఈ చిత్రాన్ని దక్కించుకున్న బయ్యర్లంతా హ్యాపీగా ఉన్నారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను.. పూరి జగన్నాధ్, చార్మిని కలసి కృతజ్ఞతలు తెలియజేశాడు. కబాలి, హుషారు లాంటి చిత్రాలని నైజాంలో రిలీజ్ చేసిన శ్రీను తాజాగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో లాభాల పంట పండించుకుంటున్నాడు. 

ఎలాగైనా మంచి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో తొందరపడకుండా వేచి చూశానని శ్రీను తెలిపాడు. ఇస్మార్ట్ శంకర్ టీజర్, ట్రైలర్ లో రామ్ తెలంగాణ యాస కొత్తగా అనిపించింది. ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని నమ్మా. అందుకే నైజాం ఏరియా హక్కులు దక్కించుకున్నాని శ్రీను తెలిపాడు. 

ప్రస్తుతం ఈ చిత్రానికి పోకిరి స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. నన్ను ఇక నుంచి ఇస్మార్ట్ శ్రీను అని పిలుస్తారని చార్మి, పూరి జగన్నాధ్ అన్నారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తాను కార్తికేయ గుణ 369 చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు శ్రీను తెలిపాడు.