రవితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌  హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి  వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

రామ్‌ తాళ్లూరి నిర్మాతగా రూపొందుతున్నఈ సినిమా ఫస్ట్ లుక్ ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 2న విడుదల చేశారు. ఈ పోస్టర్ రవితేజ ఇమేజ్ కి తగ్గట్లుగానే ఉంది. ఓ చేతిలో ఖరీదైన సిగార్... మరోచేతిలో గన్... మధ్యలో ల్యాండ్ ఫోన్‌తో పగలబడి నవ్వుతున్న ఈ పోస్టర్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

రెడ్ కలర్ సూట్ లో రవితేజ లుక్ కూడా కొత్తగా ఉంది. పోస్టర్ చూస్తుంటే థియేటర్లో రవితేజ రచ్చ చేయడం ఖాయమనిపిస్తోంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు  సమాచారం. కథ ప్రకారం డిస్కో డాన్స్ లతో యూత్ కు కిక్ ఎక్కిస్తూ డిస్కోకింగ్ గా పేరు తెచ్చుకుంటాడు రవితేజ.

రాజకీయనాయకుడితో గొడవ కారణంగా కోమాలోకి వెళ్లిన హీరో దాని నుండి బయటపడ్డ తరువాత తన రివెంజ్ ఎలా తీర్చుకుంటాడనేదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.