Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్,నితిన్ సినిమాలకే అంతంత మాత్రం,మిగతావి మటాషే?

ఈ సినిమా టీవీల్లోనూ ఫ్యామిలీలకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుందని పోటీ పడి మరీ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కరోనా పుణ్యమా అని జనం ఓటీటిలకు అలవాటుపడ్డారు. ఆ ఓటీటిలలో చక్కటి హెచ్ డీ ప్రింట్ తో , యాడ్స్ లేకుండా సినిమాని చూడటం మొదలెట్టాక టీవిలపై దృష్టి తగ్గించారు. దాంతో టీవీల్లో వచ్చే సినిమాలకు గతంలోలాగ టీఆర్పీలు రావటం లేదు.

Disappointing TRP s for Nithiin s Bheeshma film jsp
Author
hyderabad, First Published Nov 6, 2020, 8:39 AM IST

విజ‌యం అత్యవ‌స‌రం అన్న ప‌రిస్థితుల్లో ఏడాదిపాటు గ్యాప్ తీసుకుని ‘భీష్మ’ కోసం రంగంలోకి దిగి హిట్ కొట్టాడు నితిన్.   ‘దిల్’‌, ‘సై’ త‌ర్వాత  మ‌ళ్లీ అలాంటి మాస్ అంశాలున్న సినిమా ఇదే కావటంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి.సేంద్రీయ వ్యవ‌సాయం  నేప‌థ్యం తీసుకుని,త‌గిన‌న్ని మ‌లుపులు, సంద‌ర్భోచితంగా పండే హాస్యాన్ని జోడించి చిత్రాన్ని తీర్చిదిద్దటం కలిసొచ్చింది.  భావోద్వేగాలకి పెద్దగా చోటు లేకపోయినా..  రెండున్నర గంట‌లు కాల‌క్షేపాన్నిచ్చే ఒక స‌గ‌టు సినిమాలా ప్రేక్షకుడుని ఆకట్టుకుంది.

 దాంతో ఈ సినిమా టీవీల్లోనూ ఫ్యామిలీలకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుందని పోటీ పడి మరీ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కరోనా పుణ్యమా అని జనం ఓటీటిలకు అలవాటుపడ్డారు. ఆ ఓటీటిలలో చక్కటి హెచ్ డీ ప్రింట్ తో , యాడ్స్ లేకుండా సినిమాని చూడటం మొదలెట్టాక టీవిలపై దృష్టి తగ్గించారు. దాంతో టీవీల్లో వచ్చే సినిమాలకు గతంలోలాగ టీఆర్పీలు రావటం లేదు.

 రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'సాహో' సైతం బుల్లితెరపై ఆశించిన స్థాయిలో రేటింగ్స్ తెచ్చుకోలేదు. ఈ క్రమంలో ఇటీవల టీవీలో టెలికాస్ట్ అయిన యూత్ స్టార్ నితిన్ నటించిన 'భీష్మ' సినిమా చాలా తక్కువ టీఆర్పీ తెచ్చుకుందని తెలుస్తోంది. క్రితం వారం భీష్మ ఫస్ట్ టెలివిజన్ ప్రీమియర్ ప్రముఖ ఛానెల్ జెమినీలో ప్రసారం అయ్యింది. అయితే ఫస్ట్ టెలీకాస్ట్ దున్నేస్తుందనుకుంటే కేవలం 6.65 టీఆర్పీతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. 

 హిట్ సినిమాకు ఈ స్దాయి తక్కువ టీఆర్పీ రావటం టీవీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే 'భీష్మ' కు వచ్చిన రేటింగ్ మరీ తీసి వేయాల్సింది కాదు అంటున్నారు. అయితే  మొదటిసారి టెలికాస్ట్ అయిన సూపర్ హిట్ సినిమాకి మాత్రం ఇది తక్కువ టీఆర్పీ అని తేల్చారు. రాబోయే రోజుల్లో అంతంత రేట్లు పెట్టి టీవీ శాటిలైట్ రైట్స్ కొంటే ఛానెల్స్ మునిగిపోతామని అంటున్నారు. సాహో, భీష్మ సినిమాలుతో ఛానెల్స్ వారు మేలుకోవాలని సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios