ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అంటే అడల్ట్ చిత్రాలనే కామెంట్‌ ఉండేది. వెబ్‌ సిరీస్‌లో చాలా వరకు ఇలాంటి కథలతోనే రూపొందిస్తూ ఆడియెన్స్ ని ఆకర్షిస్తున్నారు. అయితే కొన్నింటిలోనే కంటెంట్‌ ఉంటుంది. ఇదిలా ఉంటే కరోనా వల్ల థియేటర్లు మూతబడటంతో సినిమాలు కూడా ఓటీటీలో విడుదలవుతున్నాయి. అందులో బలమైన కంటెంట్‌, విభిన్నమైన కథాంశంతో కూడా సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. 

తాజాగా ఈ శుక్రవారం ప్రముఖ దర్శక, నిర్మాత ఎం.ఎస్‌.రాజు రూపొందించిన `డర్టీహరీ` విడుదలైంది. శ్రవణ్‌రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌, ఆద్యంతం నాటకీయభరితంగా ఈ సినిమాని రూపొందించారు ఎం.ఎస్‌.రాజు. ఫ్రైడే మూవీస్‌ ఏటీటీలో ఇది విడుదలైంది. అయితే తాజాగా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుందట. ఫ్రైడే మూవీస్ ఏటిటిలో విడుదలైన ఈ చిత్రం 24 గంటల్లో 91818 వ్యూస్ దక్కించుకుందని చిత్ర బృందం తెలిపింది. కేవలం ఒక్క రోజులోనే ఓ చిన్న సినిమాకి  ఈరేంజ్‌లో వ్యూస్‌ రావడం చర్చనీయాంశంగా మారింది. 

ఇక ప్రైడే మూవీస్‌లో ఒక్క టికెట్ తీసుకుంటే ఎంతమంది ఎన్నిసార్లైనా ఒక్క రోజు గంటల టైమ్‌లో చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విడుదలైన `డర్టీ హరీ` సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమా విడుదలైనపుడు ఒకేసారి 25 వేల మంది రావడంతో ఏటిటి యాప్‌కు కొన్ని సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. అయితే వెంటనే టెక్నికల్ టీం దీన్ని సాల్వ్ చేయడంతో వ్యూస్ సంఖ్య పెరుగుతూనే ఉందని యూనిట్‌ పేర్కొంది. సినిమాకు మంచి టాక్ రావడంతో వ్యూస్ మరింతగా పెరుగుతాయని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. సస్పెన్స్, బోల్డ్ రొమాన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ఎమ్మెస్ రాజు. మంచి ట్విస్టులతో పాటు ఆసక్తికరమైన కథనం ఉండటంతో డర్టీ హరి చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం తెలిపింది. మరి ఇది నిజమేంతా అనేది చూడాలి.