ఇందులో నాని బ్రాహ్మల కుర్రాడు సుందరం పాత్రలో కనిపించగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీల థామస్ పాత్రలో నటించింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది.  


న్యాచురల్ స్టార్ హీరో నాని.. మలయాళం బ్యూటీ నజ్రీయా జంటగా నటించిన సినిమా అంటే సుందరానికీ (Ante Sundaraniki). డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న విడుదలైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మేత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని నిర్మించారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వస్తోంది. ఇందులో నాని బ్రాహ్మల కుర్రాడు సుందరం పాత్రలో కనిపించగా.. నజ్రీయా క్రిస్టియన్ అమ్మాయి లీల థామస్ పాత్రలో నటించింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఈ చిత్రం లెంగ్త్ పెరిగిందని, ఫస్టాఫ్ ట్రిమ్ చేయాలనే విషయమై స్పందించారు.

వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ..."ఈ సినిమా ఫస్టాఫ్ చాలా స్లోగా ఉందని అంటున్నారు. హీరో హీరోయిన్స్ చిన్నప్పటి నుంచి చెబుతూ రావడం వలన అలా అనిపించింది ఉంటుంది. సెకండాఫ్ ను స్పీడ్ గా తీసిన నాకు ఫస్టాఫ్ స్పీడ్ గా ఉండాలని తెలియదా? సెకండాఫ్ మీకు కనెక్ట్ కావాలంటే ఫస్టాఫ్ అలా ఉండాల్సిందే. ఇక ఈ సినిమా ఫస్టాఫ్ నిడివి ఎక్కువగా ఉంది .. తగ్గించే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఫస్టాఫ్ లో ఏది ఎంతవరకూ ఉండాలనేది ఆలోచన చేసుకునే తీశాము. అందువలన నిడివి తగ్గించే ఆలోచన లేదు." అంటూ చెప్పుకొచ్చాడు. 

 ఈ విషయమై నాని రిలీజ్ కు ముందు మీడియాతో మాట్లాడుతూ.... "వివేక్ ఫోన్ చేశాడు. 2 గంటల 56 నిమిషాలు లాక్ చేస్తున్నానన్నాడు. నేను ఒప్పుకోలేదు. వచ్చి సినిమా చూస్తానని చెప్పాను. పెన్ను, పేపర్ పట్టుకొని వెళ్లాను. ఎక్కడైనా ఓ 10 నిమిషాలు తగ్గిద్దామనే ఆలోచనతో వెళ్లి కూర్చున్నాను. సినిమా అంతా అయిపోయింది. పెన్ను పట్టుకునే అవసరం రాలేదు. నా గత సినిమాలకు సంబంధించి నేను ఎన్నో సీన్లు కట్ చేశాను. కథ డిస్టర్బ్ అవ్వదనుకుంటే, మంచి సీన్లు కూడా లేపేసిన సందర్భాలున్నాయి. కానీ అంటే సుందరానికి సినిమా విషయంలో ఆ పని చేయలేకపోయాను." అన్నారు.

అలాగే "గంటన్నర నిడివి ఉన్న సినిమా బోర్ కొడితే అది చాలా పెద్ద రన్ టైమ్ తో వచ్చినట్టు అర్థం. 3 గంటల సినిమా చూసినప్పుడు బోర్ కొట్టకుండా, ఎప్పుడు పూర్తయిందో కూడా తెలియకపోతే అది పెర్ ఫెక్ట్ రన్ టైమ్. అంటే సుందరానికి సినిమా ఈ రెండో కేటగిరీలోకి వస్తుంది. సినిమా పెర్ ఫెక్ట్ లెంగ్త్ లో ఉంది." అన్నారు. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంట‌లు.